రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోలీస్ కానిస్టేబుల్ కుటుంబానికి సిపి సాయి చైతన్య చెక్ పంపిణీ చేశారు. ఇటీవల ఎ.ఆర్ కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్స్ లో విధులు నిర్వహిస్తున్న పి. శంకర్ సారంగపూర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
దీంతో గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్స్ రెన్స్ రూపంలోగల చెక్కు రూ.5,00,000/- ( ఐదు లక్షల రూపాయల ) చెక్కును శుక్రవారం కీ॥ శే॥ పి. శంకర్ భార్య విజయ కి చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) జి. బస్వారెడ్డి, అదనపు డి.సి.పి (ఎ.ఆర్) కె. రామచంద్రరావు, ఎ.ఓ అనిసాబేగం, రిజర్వు ఇన్స్పెక్టర్ (వెల్ఫేర్ ) శ్రీనివాస్, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంటు షకిల్పాషా, డి.పి.ఓ సీనియర్ అసిస్టెంటు పి. రాజేశ్వర్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
