ఏ మంత్రి వచ్చినా,,, జిల్లాల్లో ముందస్తు అరెస్టులు,, ధర్నా చౌక్ ఎత్తివేయడం అంశంపై నిరసనలు వ్యక్తం చేశామని అన్నారు. పాత ప్రభుత్వాన్ని విమర్శించిన మీరు మీ ప్రభుత్వం ఈరోజు ఏం జరుగుతుంది ఒక్కసారి సమక్షించుకోవాలని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు. మంత్రుల పర్యటనకు మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చేస్తున్నారనీ ఆవేదన వ్యక్తంచేశారు.
శనివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆలూరు కు పాదయాత్రకు వస్తున్న సందర్భంగా మా విద్యార్థి విభాగం నాయకుల ఇండ్లపై పోలీసులు దాడులు చేయడం అప్రజాస్వామ్యనీ గుర్తు చేశారు. మేము నిరసన కార్యక్రమం తెలియజేయాలని ఎక్కడ కూడా నిర్ణయం చేయలేదు. ఇది ఒక రాజకీయ పార్టీ పర్యటన దాన్ని మేమెందుకు నిరసన వ్యక్తం చేస్తాం ఆలోచించండి అని చెప్పారు.
శనివారం ఉదయం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఆర్మూర్ కార్యాలయంపై పోలీసులు సివిల్ డ్రెస్ లో వచ్చి ఒక్కరు కూడా పురుషులు లేరు ఆ సమయంలో. కార్యాలయంలో మహిళలు నివారించిన మాకు భయమైతుందనీ తెలిపారు.
మీరు ఎవరు అని చెప్పేసి చెప్పిన దురుసుగా ప్రవర్తించి మహిళలని అవమానించి అన్ని రూముల్ని వెతకడం ఒక భయానక పరిస్థితి కల్పించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇప్పటికే అరుగుల్ గ్రామంలో మా కార్యకర్తల ఇండ్లలో సోదాలు చేశారు. పిడిఎస్యు నాయకులు అరెస్ట్ చేశారు.. నరేందర్ కొరకు వెళ్లి హంగామ సృష్టించారు. మా పార్టీ మీ కార్యక్రమాన్ని అడ్డుకోమని కూడా పిలిపు ఇవ్వలేదు.
అయిన ముందస్తు అరెస్టుకు ఏంటని ప్రశ్నించారు . మీరు చొరవ తీసుకొని ఇలాంటి ముందస్తు అరెస్టుల్ని జరగకుండా చూడవలసిందిగా కోరారు.
ఇప్పటికే ప్రజల్లో పాత ప్రభుత్వానికి మీకు ప్రజాస్వామ్యం అమలుపరిచే దాంట్లో తేడా లేదని చర్చ జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి ఘటనలు చేయడం సరి కాదని గుర్తు చేశారు..
నిన్ననే ముఖ్యమంత్రి కమ్యూనిస్టులు ఉప్పు లాంటివారు ఉప్పు లేకుండా ఏ శాకం రుచిరాదని అంతేకాకుండా కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు కానీ ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి ఉన్నవారిని అన్నారు. ఆ విషయం తమరికి గుర్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
