అర్ధరాత్రి వేళ కారణం లేకుండా రోడ్లపై గుమిగూడుతున్న యువకులకు సైదాబాద్ పోలీసులు చెక్ పెట్టారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎస్ఐ బి.జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ‘ఆపరేషన్ ఛబుత్ర’ నిర్వహించారు.
సైదాబాద్, పరిసర ప్రాంతాల్లోని చౌరస్తాలు, పార్కులు, గల్లీల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత అనవసరంగా గుమిగూడిన పలువురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వారిని సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఎస్ఐ జ్ఞానేశ్వర్ సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై తిరగడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, చట్టపరమైన సమస్యలు, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించారు. భవిష్యత్తుపై దృష్టి సారించాలని సూచించారు.
అనంతరం యువకుల వివరాలను నమోదు చేసి, తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరికలతో వారికి అప్పగించారు.‘ఆపరేషన్ ఛబుత్ర’ను నిరంతరం కొనసాగిస్తామని ఎస్ఐ జ్ఞానేశ్వర్ తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను గమనిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
