నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు వచ్చాయి ఈ నెల 15 జరిగే మేయర్ స్థానం మీదే ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి.ఫలితాలు పూర్తీ స్థాయిలో రాక ముందే పార్టీలు మద్దతు కూడా గట్టే పనిలో వుండే ఈసారి 30 కి పైగా స్థానాలు వస్తాయని భావించిన బీజేపీ 28 దగ్గరే ఆగిపోయింది.
ఎంపీ ఎమ్మెల్యే లతో పాటు ఇద్దరు ఎమ్మెల్సీ లను రంగంలోకి దించాలని కమలనాధులు మొదట వ్యూహ రచన చేశారు. మొదట అంచనాల మేరకే ఫలితాలు రావడంతో సంబర పడ్డ బీజేపీ కి చివరిలో రెండు మూడు స్థానాలు చేజారి పోవడంతో ఖంగు తిన్నారు.అయినప్పటికీ బీజేపీ.
కార్పొరేషన్ లో అతి పెద్ద పార్టీగా అవతరించింది. బిఆర్ యస్ అభ్యర్థి ని తమ వైపు తిప్పుకొవడానికి యత్నించారు కానీ అతను అందుబాటు లోకి రాకవపోవడంతో ఆశలు వదులుకున్నారు.
ఎక్స్ అఫిషియో వోట్ల తో మేయర్ స్థానం దక్కించుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తుందా లేదా అనేది ఇంకా తేలడం లేదు 28 మంది కార్పొరేటర్ లతో పాటు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్సీ లున్నారు 32 మంది అవుతున్నారు.
కానీ . 17 స్థానాలు దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా మేయర్ పీఠం దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.తన సొంత జిల్లా కావడం తో పీసీసీ చీఫ్ మహేష్ ఫలితాలు రాకముందే నిజామాబాద్ వచ్చి స్వయంగా పావులు కదుపుతున్నారు. మేయర్ కు అవసరమైన మద్దతు కూడగట్టి పని లో పడ్డారు.
14 స్థానాలతో రెండో పెద్ద పార్టీ నిలిచిన యంఐయం మద్దతు కోసం దారుస్సలాం పెద్దలను సంప్రదించే పనిలో మహేష్ ఉన్నారని సమాచారం .. వరసగా రెండు సార్లు మేయర్ స్థానం దక్కించుకున్న బిఆర్ యస్ ఒక్క స్థానానికే పరిమితం అయింది. కానీ ఒకే స్థానం గెలిచిన ఆ పార్టీ కార్పొరేటర్ మేయర్ ఎన్నికలో కీలకంగా మారబోతున్నారు సదరు కార్పొరేటర్ ను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తమ క్యాంప్ కు తీసుకెళ్ళింది.
14 మంది యంఐయం సభ్యులతో పాటు బిఆర్ యస్ సభ్యుడి తో కాంగ్రెస్ కు 32 మంది మద్దతు లభించేలా ఉంది దీనితో పాటు రూరల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లతో ఇద్దరు ఎక్స్ అఫిషియో సభ్యులన్నారు మొత్తంగా కాంగ్రెస్ బలం 34 చేరే ఛాన్స్ ఉంది.
