యంఐయం మద్దతు ఇవ్వడానికి సానుకూల సంకేతాలు ఇవ్వడంతో మేయర్ పీఠం దక్కించుకోవడానికి మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా ఎవరికి అవకాశం ఇవ్వాలనేది కసరత్తులు చేస్తుంది.
నిజామాబాద్ నగరమేయర్ పీఠం మహిళా జనరల్ అయింది. అందుకే వ్యాపార వేత్త నరేందర్ రెడ్డి సతీమణి సమంత ను కార్పొరేటర్ బరిలోకి దించారు కానీ ఆమె అనూహ్యంగా ఓడిపోయింది.
ఎన్నికల పక్రియ మొదలైనుంచి ఆమెనే మేయర్ అభ్యర్థిగా భావించిన కాంగ్రెస్ పెద్దలు ఇప్పడు పునరాలోచనలో పడ్డారు కాంగ్రెస్ నుంచి 17 మంది కార్పొరేటర్లు గెలిచారు వీరిలో ఎవరికి మేయర్ చాన్స్ ఇవ్వాలనేది కాంగ్రెస్ నేతలు తర్జన భర్జనలు పడుతున్నారు.
గెలిచిన మహిళలో జనరల్ మహిళా ఎవరూ లేరు అందుకే జనరల్ మహిళా మేయర్ అయ్యే ఛాన్స్ లేకుండా పోయింది. అందుకే ఇప్పుడు మేయర్ గా బీసీ అభ్యర్థి కి అవకాశం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అనివార్యంగా మారింది.
శనివారం ఉదయమే గెలిచిన కార్పొరేటర్ లందరిని హైదారాబాద్ తరలించిన కాంగ్రెస్ పార్టీ 16 న జరిగే మేయర్ ఎన్నికలో తమ అభ్యర్థిగా ఎవరిని రంగంలోకి దించాలనే విషయంలో పీసీసీ మహేష్ సీఎం రేవంత్ తో పాటు అగ్ర నేతలతో సమాలోచలు చేస్తున్నారు. డీసీసీ నగర అధ్యక్షలు లతో కొంత మంది ముఖ్య నేతలను సైతం మహేష్ వాకబు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఇద్దరు కార్పొరేటర్ల పేర్లు తెరమీదికి వచ్చాయని సమాచారం. 21 49 డివిజన్ కార్పొరేటర్ల పేర్లు తెర మీదికి వచ్చాయి. 21 కార్పొరేటర్ పంచరెడ్డి లలితా 49 డివిజన్ నుంచి కూరగాయల ఉమా రాణి లు గెలిచారు. వీరిలో మున్నారు కాపు కు చెందిన లలిత పంచరెడ్డి చరణ్ సతీమణి .
చరణ్ సుదీర్ఘ కాలంగా యన్ యస్ యూ ఐ యూత్ కాంగ్రెస్ ల్లో పనిచేసారు. ఆయనకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చే విషయంలోనూ మహేష్ తీవ్ర ఒత్తిళ్ల ను సైతం పక్కు పెట్టారు. అనేక ప్రతికూల పరిస్థితులను అధిగమించి గెలిచారు.
నగరంలో బలమైన సామజిక వర్గంగా ఉన్న మున్నారు కాపు లకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ సీనియర్ నేతల్లోఉంది మరో వైపు ఉమారాణి భర్త కరాటే రమేష్ సైతం సుదీర్ఘ కాలంగా పార్టీ లో పనిచేస్తున్నారు అదీగాక పీసీసీ చీఫ్ మహేష్ తో నాలుగున్నర దశాబ్దాలుగా దోస్తాని ఉంది.
అందుకే మహేష్ కూడా ఆయన వైపు మొగ్గు చూపే ఛాన్స్ లేకపోలేదు అదీగాక ఇప్పటిదాకా ముదిరాజ్ సామజిక వర్గం కు కీలక మైన అవకాశాలు కూడా రాలేదని మేయర్ అవకాశం ఆ వర్గం కు ఇస్తే కొత్త సామజిక ప్రయోగం చేసినట్లు అవుతుందనే వాదన కూడా పార్టీ వర్గాల్లో ఉంది.
మొత్తంగా మేయర్ పీఠం కు మార్గం సుగమంకావడంతో కాంగ్రెస్ పార్టీ లో సమరోత్సాహం కనిపిస్తుంది. జనరల్ మహిళా అయినా మేయర్ పీఠం ను బీసీ లకు ఇవ్వడానికి హాట్ టాపిక్ గా మారింది
