రాష్ట్రసాధన ఉద్యమాన్ని మలుపుతిప్పి, గెలుపు వైపు నడిపించిన అరుదైన ఘట్టం అని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్ తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి, జయశంకర్ కు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ 11 రోజులు.. తెలంగాణ నలుదిశలను ఏకం చేసిందన్నారు. ‘తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ది ఎప్పటికీ చేరిపేయలేని సంతక మన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరివల్ల కాదన్నారు.
కేసీఆర్ చావు నోట్లో తలపెట్టిన ‘ దీక్షా దివస్ ‘ చరిత్రలో చెరిగిపోని సంతకమని అన్నారు.ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన దమ్మున్న నేత కేసీఆర్.తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన యోధుడు కేసీఆర్. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతోనవంబర్ 29, 2009 న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసిందనీ పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక స్థానం లభించిందన్నారు. కేసీఆర్ పార్టీ పెట్టిన మొదట్లో తొలి విజయం నిజామాబాద్ జిల్లా పరిషత్ స్థానం కైవసం చేసుకుందని అన్నారు.
అలాగే నిజామాబాద్ లో ఎంతో మంది ఉద్యమకారులతో కలిసి ఉవ్వెత్తున ఉద్యమాన్ని నిర్వహించామని గుర్తు చేశారు అలాగే జిల్లాలో కోర్టులను కూడా దిగ్బంధనం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇక 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రాన్ని లాస్ట్ కు తీసుకెళ్లారని విమర్శించారు.ఇక వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని జోస్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసినరక్తదాన శిబిరంలో బీ ఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు. పార్టీ కార్యాలయం లోనే అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,బోధన్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆయేషా ఫాతిమా షకీల్,మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావులతో పాటు పార్టీ సీనియర్ నాయకులు వీజి గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
