నందిపేట్ మండల కేంద్రంలోని నందికేశ్వర ఆలయంలో రాత్రి దొంగతనానికి యత్నించిన వ్యక్తిని ఆలయ పలువురు పట్టుకొని దేహ శుద్ధి చేశారు.
అనంతరం పోలీసులకు సమాచారం అందించి అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే..
నందిపేట్ మండలం కొండూరు గ్రామానికి చెందిన ఓవ్యక్తి రాత్రి 10 గంటల ప్రాంతంలో రెండు కర్రలతో, హాక్సా బ్లేడ్లు, పానాతో గేటుకు తాళం ఉన్న గుడిలోకి దూకి ప్రధాన ఆలయం తాళం కోయడం ప్రారంభించారు.
దీన్ని గమనించిన పంతులు వీడియో రికార్డు చేసి కమిటీ సభ్యులకు తెలుపగా వెంటనే కమిటీ చైర్మన్, సభ్యులు హుటాహుటిన వెళ్లి దొంగను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.