గ్యాస్ ఏజెన్సీ ముందు గ్యాస్ డెలివరీ కార్మికుల ధర్నా.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న డెలివరీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
శనివారం నిజమా జిల్లా కేంద్రంలో శేఖర్ గ్యాస్ ఏజెన్సీ ముందు కార్మికుల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన అసమ్మే ఆరవ రోజుకు చేరిందని అన్నారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ కార్యదర్శి హనుమాన్లు మాట్లాడుతూ ఆయిల్ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వినియోదారుల నుంచి ఎంత డబ్బు తీసుకోవాలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
