Saturday, June 14, 2025
HomeEditorial Specialకేంద్ర క్యాబినెట్ లో ఈసారైనా జిల్లాకు ప్రాతినిధ్యం దక్కేనా ......అర్వింద్ జీవన్ రెడ్డి ల్లో ఎవరికి...

కేంద్ర క్యాబినెట్ లో ఈసారైనా జిల్లాకు ప్రాతినిధ్యం దక్కేనా ……అర్వింద్ జీవన్ రెడ్డి ల్లో ఎవరికి దక్కేనో ..

దిగ్గజ నేతలకు అడ్డాగా ఉన్న నిజామాబాద్ జిల్లాకు ఇప్పటిదాకా కేంద్ర మంత్రి మండలి లో ప్రాతినిధ్యమే దక్కలేదు. ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ జిల్లాకు మాత్రమే ఇప్పటిదాకా మంత్రి పదవీ దక్కలేదు.

అందుకే ఈసారి ఎంపీ ఎన్నికలో విజేతలెవ్వరైనా సరే మంత్రి అవ్వడం ఖాయమనే చర్చ ప్రధాన పార్టీల్లో సాగుతుంది. ఈనెల మొదటి వారం కొలువుదీరే కేంద్ర క్యాబినెట్ లో జిల్లాకు బెర్త్ దక్కాలనే డిమాండ్ మొదలయ్యింది. అర్వింద్ జీవన్ రెడ్డి ల్లో ఒకరికి మంత్రి అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

గెలుపు కన్న మంత్రి పదవీ మీదే బెట్టింగ్ లు జరుగుతున్నాయి. లోకసభ ఎన్నికల పక్రియ మొదలై ఏడు దశాబ్దాలు అయింది.18 పర్యాయాలు ఎన్నికలు నిర్వహించారు. తొమ్మిది మంది దిగ్గజ నేతలే ఎంపీ గా పనిచేసారు.

అందులోనూ ముగ్గురు నేతలు హ్యాట్రిక్‌ సాధించారు .ఈ స్థానానికి మొత్తం 18 సారి ఎన్నికలు జరిగాయి. తొలి ఎంపీగా విజయం సాధించిన హరీశ్‌చంద్ర హెడా మూడుసార్లు ఎంపీగా ఎంపికై రికార్డును సృష్టించారు. 1952, 1957,1962లలో పార్లమెంట్‌ ఎన్నికలు జరుగగా హరీశ్‌చంద్ర హెడా వరుసగా ఎంపీగా గెలుపొందారు.ఆయన కు నెహ్రు తో సన్నిహిత సంబంధాలే వుండేవి. కానీ మంత్రి ఛాన్స్ మాత్రం దక్కలేదు.

ఎం.రాంగోపాల్‌రెడ్డి 1971, 1977, 1980లలో వరుసగా విజయంసాధించినా ఆయనకు మంత్రి ఇవ్వలేదు . 1991లో కేశ్‌పల్లి గంగారెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఈయన 1998, 1999లలో కూడా ఎంపీగా గెలుపొంది హ్యాట్రిక్‌ ఎంపీగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు.

హ్యాట్రిక్‌ సాధించిన ఎంపీలలో ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన వారు కాగా కేశ్‌పల్లి గంగారెడ్డి టీడీపీ తరపున బరిలో నిలిచి ఎంపీ అయ్యారు. అయితే పీవీ హయాంలో తిరుగుబాటు చేసి కాంగ్రెస్ లోకి వెళ్లిన అయన మంత్రి అవుతారని విసృతంగా ప్రచారం జరిగింది. వరుసగా రెండో సారి ఎంపీ గా గెల్చిన మధు యాష్కీ సైతం అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది.

తెలంగాణ ఉద్యమ కాలం లో కెసిఆర్ స్థానంలో యాష్కీ కి కేంద్ర క్యాబినెట్ లో తీసుకుంటారని భావించారు.అలాగే తెరాస నుంచి ఎంపీ గా గెల్చిన కవిత సైతం మోడీ క్యాబినెట్ లో చేరబోతున్నారంటూ ఆమె సన్నిహితులు అనేక సార్లు ఊదరగొట్టారు. చివరికి తుస్సుమనిపించారు.

కానీ ఈసారి నిజామాబాద్ లోకసభ ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల్లో ఎవరూ గెలిచినా కేంద్ర మంత్రి అవుతారని ఎన్నికల ప్రచారంలో క్యాడర్ పనిగట్టుకొని ప్రచారం చేసారు. మూడో సారి మోడీ వస్తారని దేశవ్యాప్తంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో అర్వింద్ రెండో సారి గెలిస్తే మోడీ క్యాబినెట్ లో బెర్ట్ దక్కుతుందని కాషాయ శ్రేణులు చెప్తున్నాయి.

అందుకే అర్వింద్ ఈసారి భారీ మెజార్టీ కోసం స్కెచ్ వేసి రంగంలోకి దిగారు. బీజేపీ నుంచి గెలిచే ఎంపీ లందరి కన్న అర్వింద్ కే ఎక్కువ మెజార్టీ వస్తుందని ఆయన సన్నహితులు ధీమాతో ఉన్నారు.

కానీ జీవన్ రెడ్డి గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ వస్తే తెలంగాణ నుంచి ఆయన మంత్రి ని చేసే బాధ్యత తనదే నని సీఎం రేవంత్ బహిరంగ సభలో పదే పదే హామీ ఇచ్చారు.

మొత్తానికి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీ నుంచి ఎవరు ఎంపీ గా గెలిచినా ఈసారి జిల్లాకు మంత్రి పదవీ ఖాయం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!