నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నీక్ కాలేజీ మైదానం జరుగుతున్న ఎగ్జిబిషన్ లో ప్రైవేట్ వ్యక్తుల అల్లరి చేష్టలు సందర్శకులకు ఇబ్బంది గా మారింది . ఒకరిద్దరు సొసైటీ సభ్యుల తాలూకుగా చెప్పుకుంటూ కొందరు పనిపాట లేని వ్యక్తులు రోజు ఎగ్జిబిషన్ పరిసరాల్లో హడావుడి చేస్తున్నారు. ఆఫీస్ సమీపంలోనే అడ్డా వేసి మరీ కాలక్షేపం చేస్తున్నారు.
ఎగ్జిబిషన్ లో ఏ చిన్న తగాదా జరిగిన వీరి జోక్యం చేసుకొని రాద్ధాంతం చేస్తున్నారు. ఎగ్జిబిషన్ లో వందలాది వ్యాపారాలున్నాయి. రోజు వేలాది మంది ప్రజలు ఈ ఎగ్జిబిషన్ లో సేద తీరడానికి వస్తున్నారు.
నిజానికి అల్లరి మూకల బెడద ప్రతియేటా వుండేదే కానీ ఈసారి ప్రైవేట్ వ్యక్తులే అల్లరి మూకల అవతారం ఎత్తారు. తామేదో ఎగ్జిబిషన్ లో ఏ గొడవ జరగకుండా రక్షణ ఉన్నామంటూ బిల్డప్ లు ఇస్తూ ఎగ్జిబిషన్ లో కాలాతిరుగుతూ హడావుడి చేస్తున్నారు. నిజానికి వీరిని ఎవ్వరు ఎగ్జిబిషన్ లోకి అనుమతి ఇచ్చారు ఏ అవసరాల కోసం వీరు ఎగ్జిబిషన్ లో హడావుడి చేస్తున్నారనేది ఎవ్వరికి అంతుచిక్కడం లేదు.
కానీ ప్రైవేట్ వ్యక్తులు ఏ పాస్ లేకుండా సాయంత్రానికే లోపలి వచ్చేసి హడావుడి చేస్తుండడం గమనార్హం. ఇద్దరూ సొసైటీ సభ్యుల తాలూకుగా లోపలికి ఎంట్రీ ఇస్తున్నారట.జాయింట్ వీల్ వద్ద మాజీ కార్పొరేటర్ నిర్వాహకుడు మాట మాట జరుగుతుంటే క్షణాల్లో వచ్చిన ప్రైవేట్ ముఠా సదురు కార్పొరేటర్ నే సముదాయించి పంపేశారు. నిజామాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ కి దశాబ్దాల చరిత్ర ఉంది.
ప్రతియేటా వేసవి కాలం లో ప్రజల వినోదం కాలక్షేపం కోసం సొసైటీ ఆధ్వర్యంలో వ్యవసాయ పారిశ్రామిక ప్రదర్శన పేరుతొ ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. కానీ క్రమేపి ఎదో ఫక్తు వ్యాపారం లా మార్చిసారు. భారీ గా ఆదాయం సమకూర్చుకోవడానికే నిర్వాహకులు ప్రాధాన్యత ఇస్తూ సొసైటీ మూల సిద్ధాంతాలను గాలికి వదిలేస్తున్నారు. వినోదం …కాలక్షేపం …ఆటవిడుపు కు కేరాఫ్ అడ్డా గా ఉండే ఎగ్జిబిషన్ లో ప్రైవేట్ వ్యక్తుల హడావుడి ఎందుకనేది ఎవ్వరికి అర్థం కావడం లేదు.
నిజానికి ఎగ్జిబిషన్ లో ఆయా పనులు కాంట్రక్టులు సొసైటీ సభ్యులే తలా ఇన్ని పంచుకుంటారు.ఆ కాంట్రాక్టులు పొందినవారే తాలూకూ వారే ఎగ్జిబిషన్ లో హడావుడి చేస్తున్నారు. చివరికి బయట ప్రైవేట్ పార్కింగ్ లో పనిచేసే వారుకూడా ఎగ్జిబిషన్ లో బలాదూరుగా తిరుగుతున్నారంటే ఎగ్జిబిషన్ నిర్వహణ ఎలా ఉందొ అర్థం చేసుకోవచ్చు .
నిజానికి ప్రతియేటా ఎగ్జిబిషన్ లో అల్లరి మూకల బెడద అడ్డుకట్ట వేయడానికి పోలీసు శాఖ గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తుంది. ఎందుకో ఈసారి పోలీసు బందోబస్తు కూడా పటిష్టంగా లేదనే మాట వినిపిస్తుంది