HomeCinemaదిల్ రాజు నువ్వు కల్లు దుకాణం పెట్టుకో .........తెలంగాణ మీద ఎలా విషం చిమ్ముతావు .......ఎమ్మెల్సీ...

దిల్ రాజు నువ్వు కల్లు దుకాణం పెట్టుకో ………తెలంగాణ మీద ఎలా విషం చిమ్ముతావు …….ఎమ్మెల్సీ దేశపతి ఆగ్రహం

ఎమ్మెల్సీ సినీ నిర్మాత దిల్ రాజుపై ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తెలంగాణలో సినిమాలకు వైబ్ ఉండదని..

మాంసం, కల్లుకు వైబ్ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై దేశపతి స్పందిస్తూ.. వైబ్ లేకపోతే సినిమా వ్యాపారం మానుకోవాలని, కల్లు, మాంసం దుకాణాలు పెట్టుకోవాలని దిల్ రాజుకు సూచించారు.

వైబ్ లేకపోతె తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు ఎందుకు పెంచారని ప్రశ్నించారు.ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యమ సాహిత్యకారుడు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “అయ్యా దిల్ రాజు తెలంగాణలో వైబ్ లేకుంటే సినిమాలు మానుకో.

వైబ్ కావాలంటే కల్లు కంపౌండ్, మాంసం దుకాణం పెట్టుకో. దిల్ రాజు ఏనాడు తెలంగాణ వ్యక్తిలా వ్యవహరించలేదు. తెలంగాణ ప్రజల సంస్కృతిని అవమానించేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.

సినిమా టికెట్ల ధరలు పెంచమన్న సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పుడు ధరల పెంపు పై ప్రజలకు సమాధానం చెప్పాలి.

సీఎం రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణీ మరోసారి బయటపడింది. గేమ్ ఛేంజర్ కి ప్రత్యేక మినహాయింపులు ఎందుకు ఇచ్చారు” అంటూ ఆయన మండిపడ్డారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments