డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి 3 రోజులు జైలు శిక్ష విధించినట్లు ఇందల్వాయి ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెళ్లితే ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ నిర్వహిస్తుండగా గోపాల్ మొరె పట్టుబడినట్లు తెలిపారు.
అతనిని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ (Exice కోర్టు నిజామాబాద్ ) ముందు గురువారం హాజరు పరచగా అహ్మద్ మొయినుద్దీన్ మెజిస్ట్రేట్ గారు 3 రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.ఎవరైనా వ్యక్తులు మద్యం తాగి వాహనం నడిపినట్లైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడుననీ ఎస్ఐ ఇందల్వాయి మనోజ్ కుమార్ తెలిపారు.
