మరో రెండు మాసాల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతుంది.ఈ నేపథ్యంలో డివిజన్ ల విభజన వ్యవహారం మరోసారి తెరమీదికి వచ్చింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఓ కార్పొరేషన్ తో పాటు ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి.కార్పొరేషన్ తో పాటు మున్సిపాలిటి ల్లోనూ డివిజన్ వార్డ్ లను పునర్విభజన చేయడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది.
రాజకీయ ప్రయోజనాలు ఇమిడి ఉండే ఈ పక్రియ కు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రధాన రాజకీయ పార్టీలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పుడున్న డివిజన్ వార్డు లను పెంచాలనేది ప్రభుత్వ ఆలోచన గా ఉంది.
మొత్తంగా ఈ పక్రియ తో ఎన్నికల్లో సానుకూల ఫలితాలు సాధించే ఎత్తుగడ లో అధికార పార్టీ ఉంది. ఈ నేపథ్యంలో 60 డివిజన్ లున్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో డివిజన్ లను పెంచాలనే డిమాండ్ ఉంది.
నగర శివారులోని గ్రామాలను కార్పొరేషన్ పరిధి లో విలీనం చేయడంతో పాటు నగరం నాలుగు వైపుల అంచనాల కు అందనంత గా విస్తరించింది. అందుకు అనుగుణంగా కనీసం 75 డివిజన్ లను పెంచాలని వాదన ఉండే అయితే ప్రతిపాదనల దశలో నే నిలిచి పోయింది.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏడాది క్రితమే డివిజన్ వార్డు పెంపు ను తెరమీదికి తెచ్చింది. ఎన్నికలకు సిద్ధం అవుతున్న సర్కార్ డివిజన్ వార్డు లను ఉన్నపలంగా పెంచ డానికి సిద్ధం అవుతుంది స్థానిక సంస్థల్లో వార్డుల విభజనకు 2021 జనవరి 30వ తేదీన జారీ చేసిన మార్గదర్శకాలనే అనుసరించబోతున్నారు .
వార్డులను మొదట ఉత్తరం నుంచి ప్రారంభించి అటు నుంచి తూర్పు, దక్షిణం, పడమర వైపుగా క్లాక్వైజ్డైరెక్షన్‌లో చేయాల్సి ఉంటుంది. జనాభా లెక్కలు లేదా తాజాగా ఉన్న ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకొని ఒక్కో వార్డు జనాభా లేదా ఓటరు వారీగా వార్డులను విభజించాలని సూచించారు.
అన్ని పట్టణ ఓటరు లేదా జనాభా లెక్కలకు సగటును తీసి ఒక్కో వార్డులో 10 శాతం ఎక్కువగా కాకుండా ఉండే విధంగా చూడాలని సూచించారు.
కానీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో అదనంగా మరో డివిజన్ లను ఏర్పాటు చేయాలని అంటే 80 డివిజన్ లుండాలని అధికార పార్టీ నేతలు గట్టిగా ప్రతిపాదిస్తున్నారు. కానీ 75 డివిజన్ లఏర్పాటు చేయడానికి సాధ్యం అవుతుందని అధికారులు చెపుతున్నారు
