బహుజన్ సమాజ్ పార్టీ (బి ఎస్ పి) పార్లమెంట్ ఇన్చార్జిగా డాక్టర్ నీరడి లక్ష్మణ్ ను నియమించారు. బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ జి మాయావతి ఆదేశాల మేరకు ముఖ్య సెక్టార్ ప్రబారి అతార్ సింగ్ రావు , మరొక ముఖ్య సెక్టార్ ప్రబారి సురేష్ ఆర్య ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్, కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజ్ ల సూచనల మేరకు నిజామాబాద్ పార్లమెంట్ ఇంచార్జిగా డాక్టర్ నీరడి లక్ష్మన్ బుధవారం నియమించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నీరడి లక్ష్మన్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో నిజామాబాద్ పార్లమెంట్ ఇన్చార్జిగా నియమించినందుకు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ జి మాయావతి ఆదేశాల మేరకు ముఖ్య సెక్టార్ ప్రబారి అతార్ సింగ్ రావు , మరొక ముఖ్య సెక్టార్ ప్రబారి సురేష్ ఆర్య ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్, కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ముదిరాజు, చీఫ్ జోన్ ఇన్చార్జ్ అడ్వకేట్ నిమిషాని రాంచందర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
పార్టీ ఆశయాలను గ్రామస్థాయికి తీసుకు వెళ్లేందుకు, బహుజనుల హక్కుల సాధన కోసం పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు.
