కాకతీయ విద్యా సంస్థ ల అధినేత రజనీకాంత్ తో ఆదివారం మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి.ని ఆయన ఇంట్లో కలిశారు పాలిటెక్నిక్, ఐటిఐ, టెక్నికల్ కోర్సులలో జిల్లా విద్యార్థులు రాష్ట్రంలోనే ముందు స్థాయిలో నిలబడి జిల్లాకే మంచి పేరు తీసుకురావాలని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.
విద్యాపరంగా జిల్లాను నంబర్ వన్ స్థాయిలో తీసుక వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందించే విధంగా పలు కీలక సూచనలు సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు కూడా ముందులో ఉండాలని అన్నారు.
అలాగే టెక్నికల్ కోర్టులో కూడా జిల్లా అభివృద్ధి చెందాలన్నారు. కాకతీయ విద్యా సంస్థలకు చెందిన కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి అవసరమైతే బయట నుండి ప్రొఫెసర్లను తెప్పించి మరీ నాణ్యమైన విద్యను అందించే విధంగా కృషి చేస్తామని రజనీకాంత్ ఎమ్మెల్యేకు తెలిపారు.
జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఐటిఐ కళాశాలలు, కళాశాలలో ఈసారి ఇంప్లిమెంట్ కావాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమం లో తాహెర్ బిన్ అహ్మద్, అంతిరెడ్డి రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
