ఆదివారం నిజామాబాద్ జిల్లా పోలీస్ లైన్ లో భరోసా కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, డిఐజి జితేందర్, ఇన్చార్జి సీపీ సింధు శర్మ ప్రారంభించారు. మంత్రి భరోసా ప్రజలకు ఎలా ఉపయోగపడుతుందని అడిగి తెలుసుకున్నారు. అలాగే భరోసా సెంటర్ ను తిరిగి సందర్శించారు చేశారు.అనంతరం ఇన్చార్జి సీపీ సింధు శర్మ మాట్లాడుతూ..
రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉమెన్ సేప్టివింగ్ పర్యవేక్షణలో భరోసా సపోర్ట్ సెంటర్ ఫర్ ఉమెన్, చిన్నా రుల కోసం భరోసా సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రైవేట్, పబ్లిక్ ప్రదేశాలలో కుటుంబంలో, సంఘంలో, కార్యాలయంలో వేధింపులకు, హింసకు గురైన మహిళలకు న్యాయం చేయడానికి ఉద్దేశిం చబడిందన్నారు.
భరోసా సెంటర్ 24 గంటలు పని చేస్తోందన్నారు. బాధిత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇక్కడ వచ్చిన వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.
ఎవ్వరికీ కూడా భయపడకుండా నిర్భయంగా భరోసాను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే తెలంగాణ లో మొత్తం 29 భరోసా కేంద్రాలు ఉన్నాయని కానీ కేవలం 10 కి కేంద్రాలు మాత్రమే పర్మినెంట్ ఉన్నాయని చెప్పారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, డీజీపీ జితేందర్, ఐజీపీ చంద్ర శేఖర్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ంధీ హనుమంతు, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, సీపీ సింధు శర్మ తదితరులు పాల్గొన్నారు.
