Monday, April 20, 2026
HomeTelanganaNizamabadఎన్నికల హామీ నెరవేర్చాలి..సీఎం దిష్టిబొమ్మ దహనం..

ఎన్నికల హామీ నెరవేర్చాలి..సీఎం దిష్టిబొమ్మ దహనం..

ఎల్లారెడ్డి ఎన్నికల హామీ నెరవేర్చనందుకు నిరసనగా ఏబీవీపీ నాయకులు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను ఆదివారం దహనం చేశారు.

సందర్భంగా ఏబీపీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా 20శాతం నిధులు విడుదల చేయకుండా కేవలం 8శాతం మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. వెంటనే మిగతా నిధులు విడుదల చేయకుంటే పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తాము అని హెచ్చరించారు.. ప్రభుత్వ జూనియర్ కళాశాల లో, డిగ్రీ కళాశాల, గురుకులా ల్లో కనీస వసతులు లేక తిండి లేక, నిద్ర లేక నాణ్యమైన ఆహరం అంధక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.

ఉన్నత చదువులు చదవక నిరుద్యోగులు గా మిగిలి పోతున్న యువతను తొక్కుకుంట వచ్చిన సీఎం వచ్చారన్నారు. మీరు తొక్కింది ప్రతిపక్షాలను కాదు విద్యార్థుల భవిషత్తు ను తొక్కి సీఎం అయ్యారని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమం లో ఏబీవీపీ నాయకులు కౌశిక్ , సాయిరాం, రాజశేఖర్, బానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!