మండలంలోని సోమార్పేట్ గ్రామంలో ట్రాక్టర్ తో ఢీకొట్టిన సంఘటనకు నిరసనగా ఎల్లారెడ్డి అఖిలపక్షం నాయకులు శుక్రవారం బందుకు పిలుపునిచ్చారు. సోమార్పేట్ గ్రామంలో గెలిచిన సర్పంచ్ అభ్యర్థి తమ్ముడు చిరంజీవి ట్రాక్టర్ ఢీకొట్టిన సంఘటనలు గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఇందులో ప్రమేయం ఉన్న నిందితులందరినీ అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఘటన జరిగి మూడు రోజులైనా నిందితులందరినీ అరెస్టు చేయలేదని వారు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు చిరంజీవిని మాత్రమే అరెస్ట్ చేశారని, మిగతా నిందితుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఆరోపించారు. ఎందుకు నిరసనగా ఎల్లారెడ్డి బందుకు పిలుపునిచ్చినట్లు అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. బందుకు మద్దతు పలకాలని అన్ని వ్యాపార సంస్థల ప్రతినిధులకు, వివిధ పార్టీల నాయకులను వారు కోరారు.
