బాన్స్ వాడ కేంద్రంలో సాగుతూ వచ్చిన దొంగ నోట్ల దందా వర్ని కి మారింది. వర్ని ఓ బ్యాంకు లో చెలామణి చెయ్యడానికి తెచ్చిన దొంగ నోట్ల ను బ్యాంకు అధికారులు గుర్తించారు.వెంట నే పోలీసులకు పిర్యాదు చేసారు గురువారం వర్ని మండల కేంద్రంలో వెలుగుచూసిన ఈ వ్యవహారం ఫై ప్రత్యేక పోలీస్ బృందం దర్యాప్తు మొదలు పెట్టింది వర్ని మండలం జలాల్ పూర్ గ్రామానికి చెందిన సాయిలు గురువారం వర్ని లోని కెనరా బ్యాంకు వచ్చి చాల రోజులుగా పెండింగ్ లో క్రాఫ్ లోన్ ను క్లియర్ చెయ్యడానికి వచ్చాడు.
రూ 2.08 లక్షల నగదు ను అన్నీ అయిదు వందల నోట్లు కావడంతో బ్యాంక్ క్యాషర్ వాటిని క్షుణ్ణంగా పరిశీలించాడు అనుమానించినట్లుగానే అవన్నీ దొంగ నోట్లుగా నిర్దారించుకున్నారు.వెంటనే వర్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన వచ్చిన సాయిలు ను అదుపులోకో తీసుకోని అక్కడే విచారించారు అంత డబ్బు ఎలా వచ్చిందని వాకబు చేశారు.
తన కొడుకు ఇచ్చాడని బ్యాంకు లో లోన్ కట్టేయాలని చెప్పడంతో తెచ్చానన్నారు కొడుకు కోసం వెళ్లగా పరారీ లో వుండడం తో అతని కోసం గాలిస్తున్నారు బాన్స్ వాడ ప్రాంతంలో దొంగ నోట్లు చెలామణి చేసే ముఠా ను కామారెడ్డి పోలీసులు ఈ మద్యే పట్టుకున్నారు ఆ ముఠా కు చెందిన వారే మరి కొందరు దొంగ నోట్ల చెలామణి చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
