ధిక్కార స్వరం ఎత్తక మొదటి సారి జిల్లాకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత కు గులాబీ శ్రేణులు దూరంగా ఉన్నారు. ఆమె నివాసం వందలాది మంది కిటకిటలాడేది జన సమూహం దాటుకొని వెళ్లడం కూడా వ్యయప్రయాస అయ్యేది.
కానీ ఈసారి ఆమె పర్యటన లో అలాంటి క్రౌడ్ మాత్రం కనిపించలేదు. సాదా సీదాగా సాగింది మొదటి నుంచి జాగృతి లో ఉన్న వారే హడావుడి చేశారు పార్టీ ముఖ్య నేతలెవ్వరూ ఆమె నివాసం వైపు రాలేదు.
నిజామాబాద్ అర్బన్ మినహా నేతలెవరూ ఆమె వైపు ఈసారి కన్నెత్తి చూడక పోవడం ఆ పార్టీ చర్చనీయాంశం అయింది. రోజంతా సాగిన ఆమె పర్యటన లో కొందరు గులాబీ నేతలు వాట్సాప్ ల్లో మాజీ ఎమ్మెల్యే లకు చేరవేయడం హాట్ టాపిక్ అయింది.
నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సీహెచ్ కొండూరు గ్రామంలో శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి దేవాలయ తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన హోమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడానికి కవిత ఒక రోజు ముందే నిజామాబాద్ నగరంలోని ఆమె ఇంటికి చేరుకున్నారు.
పార్టీలో ధిక్కార స్వరం ఎత్తాక మొదటి సారి నిజామాబాద్ పర్యటన కు వచ్చిన ఆమె మునుపటి హంగామా మాత్రం చూడలేదు. నిజామాబాద్ నగరానికి చెందిన మాజీ మేయర్ నీతూ కిరణ్ ,సుదం రవి చంద్ర, శీర్ప రాజు లాంటి నేతలు మాత్రమే కొండూరు లో సందడి చేసారు.
కానీ ఈ కార్యక్రమం జరిగిన కొండూరు నందిపేట మండలం ఆర్మూర్ సెగ్మెంట్ పరిధి లో ఉంది కానీ ఆ సెగ్మెంట్ నుంచి ముఖ్య నేతలెవ్వరూ కవిత టూర్ లో కనిపించలేదు.
//// నిఘా నీడలో సాగిన కవిత టూర్ /////
పార్టీలో అస్సమ్మతి నేతగా ముద్ర వేసుకున్న ఎమ్మెల్సీ కవిత రెండు రోజుల పర్యటన ఖరారు కాగానే పార్టీ వర్గాల్లో ఉత్కంఠ మొదలయ్యింది.కొందరు బిఆర్ యస్ నేతలే ఆమె పర్యటన లో ఉన్నట్టుగా వుంటూ ఎప్పటికప్పుడు వీడియో ఫుటేజీ కీలక నేతలకు పంపారు.
బుధవారం ఆమె ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్తుంది ఇంటలిజెన్స్ వర్గాలతో పాటు గులాబీ నేతలు సైతం వాకబు చేసారు. వీరిని ఎవరు రంగంలోకి దించారనేది మాత్రం బయటికి పొక్కడం లేదు.
ఇది పూర్తిగా కుటుంబ కార్యక్రమం కావడం వల్లే పార్టీ వర్గాలు దూరంగా ఉన్నాయని చెపుతున్న ప్రస్తుతం నెలకొన్న పరిణామాల వల్లే లీడర్ ..క్యాడర్ దూరంగా ఉన్నారనే టాక్ మాత్రం ఉంది. ఇదే ఆలయం ప్రారంభోత్సవం లో రాష్ట్రం మొత్తం కదిలి వచ్చింది జిల్లా మంత్రి ఎమ్మెల్యే లు మొత్తం ఇక్కడే పడిగాపులు కాసారు.
అయితే కవిత జిల్లా కు వస్తే ఇదివరకు ఒకరిద్ద మాజీ ఎమ్మెల్యే లు కచ్చితంగా ఆమె వెంటే ఉండేది. ఈసారి మాజీ ఎమ్మెల్యే లెవ్వరు ఆ కనుచూపు మేరలో ఉండకుండా జాగ్రత పడ్డారు.
మాజీ ఎమ్మెల్యే లు హైదారాబాద్ కు పరిమితం అయ్యారు అయితే ఓ మాజీ ఎమ్మెల్యే అడుగు ముందుకేసి ఎహే ఎందుకు వచ్చిన పంచాయితీ మీరెవ్వరు ఆ వైపు వెళ్ళద్దు అంటూ ముఖ్య నేతలకు మెసేజ్ లు పంపిన విషయంకవిత టూర్ లో కొందరు నేతలు గుస గుస లాడారు
