బాలుడిపై పోక్సో కేసు నమోదు..మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన మోపాల్ మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..
మండలంలోనీ ఓ మైనర్ బాలిక పై అదే గ్రామానికి చెందిన మైనర్ బాలుడు మంగళవారం రాత్రి అత్యాచారానికి పాల్పడుతుండగా బాలిక కేకలు వేసినట్లు తెలిపారు.బాలిక అరుపులతో నిద్రలేచిన తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలికను వైద్య పరీక్షలు నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బాలుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపారు.
