HomeCRIMEట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన ఉండాలి...ట్రాఫిక్ ఏసిపి నారాయణ..

ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన ఉండాలి…ట్రాఫిక్ ఏసిపి నారాయణ..

ప్రతి వాహనదారుడు, ప్రజలు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని ట్రాఫిక్ ఏసిపి నారాయణ సూచించారు. మంగళవారం నగరంలోని గిరిరాజ్ కళాశాల లో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పోలీస్ కళ బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయరాదని, రోడ్డు నిబంధనలు పాటించి, ప్రాణాలను రక్షించుకోవాలని పేర్కొన్నారు.

అలాగే కళ బృందం సభ్యులు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై పాటల రూపంలో,మాటల రూపంలో విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిజి కళాశాల ప్రిన్సిపాల్, ట్రాఫిక్ సిఐ వీరయ్య, కళా బృందం సభ్యులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments