HomeLaw and Orderజిల్లా కాంగ్రెస్ లో విస్త రణం ........... మూకుమ్మడి రాజీనామాలు ........రేపు బోధన్ బంద్ కు...

జిల్లా కాంగ్రెస్ లో విస్త రణం ……….. మూకుమ్మడి రాజీనామాలు ……..రేపు బోధన్ బంద్ కు పిలుపు ………రగులుతున్న సుదర్శన్ రెడ్డి వర్గీయులు

మంత్రి వర్గ విస్తరణ జిల్లా కాంగ్రెస్ లో చిచ్చు రేపింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో ఆయన వర్గీయులు రగిలి పోతున్నారు. మూకుమ్మడిగా తమ పదువులకు రాజీనామా చేయడానికి సిద్ధం అయ్యారు.

పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ను కలవడానికి హైదారాబాద్ వెళ్లారు.తమ నేతకు మంత్రి ఇవ్వనందుకు నిరసనగా మంగళవారం బోధన్ బంద్ కు పిలుపు ఇచ్చారు .

సీనియర్లను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారని సుదర్శన్ రెడ్డి అనుచరులు.మండిపడుతున్నారు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో బోధన్, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ధమ్కీ ఇస్తున్నారు.

మంత్రి పదవి ఇవ్వక పోవడంతో తీవ్ర అసంతృప్తి కి గురైన సుదర్శన్ రెడ్డి మీనాక్షి నటరాజన్ స్వయంగా వెళ్లి బుజ్జగించారు. కేవలం సమీకరణాల నేపథ్యంలోనే మంత్రి పదవీ ఇవ్వలేక పోయినట్లుగా ఆమె సముదాయించారు.

గతంలో వైఎస్ రెండో సారి సీఎం అయ్యాక ఉమ్మడి జిల్లాలో గెలిచిన సుదర్శన్ రెడ్డి కి క్యాబినెట్ మంత్రి గా అవకాశం వచ్చింది. డీఎస్. షబ్బీర్ అలీ ,సురేష్ రెడ్డి లు ఓడిపోయారు. అనుకోకుండా మంత్రిగా అవకాశం రావడంతో ఆయన సమర్థవంతంగా పనిచేసారు వివాదాలు ఆరోపణలకు దూరంగా ఉన్నారు.

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది దీనితో పాలన వ్యవహారాల్లో మరింత క్రియా శీలకంగా పనిచేయలేక పోయారు.ఆ తర్వాత వరుసగా రెండు సార్లు బోధన్ లో ఎమ్మెల్యే గా ఓడిపోయారు.

పార్టీ అధికారంలో లేక పోయిన దశాబ్ద కాలం పాటు జిల్లా పార్టీ కి పెద్దదిక్కుగా వుంటూ వచ్చారు కీలక నేతలు అందుబాటులో లేక పోయిన పార్టీ శ్రేణులకు అండగా వుంటూ వచ్చారు. ఈసారి పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో సుదర్శన్ రెడ్డికి బెర్త్ ఖాయం అంటూ ఆయన వర్గీయులు సంబర పడ్డారు.

మొదటి దఫాలో ఆయన కు మంత్రి అవకాశం రాలేదు. విస్తరణలో మంత్రి పక్క అంటూ రేవంత్ మాట ఇవ్వడంతో సుదర్శన్ రెడ్డి ఊరట చెందారు.

విస్తరణ లో ఆయనకు అవకాశం ఇవ్వాలని రేవంత్ పట్టు బట్టినా అధిష్టానం సున్నితంగా తిరస్కరించింది. సమీకరణల అస్రం సాధించింది.చివరికి రేవంత్ సైతం వెనక్కి తగ్గక తప్పలేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments