ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల పోరు మళ్ళీ షురూ అయింది .
నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ బాల్కొండ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం తహసిల్దార్ కార్యాల వద్ద ప్రభుత్వ తీర్పు నిరసనగా రైతులు తాహసిల్దార్లకు మెమోరడం సమర్పించారు.
గత నెలలో రుణమాఫీ రాని రైతులందరూ ఏకమై ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాదిగా తరలివచ్చి తమ నిరసన గళాన్ని వినిపించారు.
ఈనెల 15వ తేదీ వరకు బేషరతుగా రుణమాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. అయితే రుణమాఫీ ప్రక్రియ పూర్తికానందున తిరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు పోరుబాట పట్టారు.
ఉద్యమాల పూర్తి గడ్డ అయిన ఆర్మూర్ వేదికగా ఈ రుణమాఫీ రగడ మరోసారి ఉద్యమించనున్నది. నేడు తహసిల్దారులకు మెమోరాండం సమర్పించిన రైతు నాయకులు, రేపు సర్కారుపై వ్యతిరేకంగా ఉద్యమించేందుకు తమ కార్యచరణ వెల్లడిస్తామని వివరించారు.
