HomeTelanganaNizamabadరాహుల్ గాంధీ పై బీజేపీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరం..జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు…ఎన్.టి.ఆర్ చౌరస్తాలో బిజెపి...

రాహుల్ గాంధీ పై బీజేపీ చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరం..జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు…ఎన్.టి.ఆర్ చౌరస్తాలో బిజెపి దిష్టిబొమ్మ దగ్ధం…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతకరమని కాంగ్రెస్ కార్పొరేటర్ గడుగు రోహిత్, ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణు రాజ్ పేర్కొన్నారు.

బుధవారం ఎన్ ఎస్ యు ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరద బట్టు వేణు రాజ్, కార్పొరేటర్ గడుగు రోహిత్ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు నవాజ్ మోయిన్ రషీద్ తో కలిసి నగరంలోని ఎన్.టి.ఆర్ చౌరస్తాలో బిజెపి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేటర్ గడుగు రోహిత్ మరియు వరద బట్టు వేణు రాజ్ మాట్లాడుతూ.

తన్వీందర్ను వెంటనే బీజేపీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.గత కొంతకాలంగా రాహుల్ గాంధీ, బిజెపి ప్రభుత్వ విధానాలను ఎండగట్టి ప్రజల పక్షాన నిలబడి దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారని ఇందులో భాగంగా దేశంలో బిజెపి హయాంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, అవిద్య, సామాజిక అసమానతలు, మత విద్వేషాలు, మహిళల పై జరుగుతున్న ఆకృత్యాలు ,

మణిపూర్ అల్లర్లు గురించి బిజెపి ప్రభుత్వాన్ని నిలదీయడమే కాకుండా దేశంలో కార్పొరేట్ శక్తులకు 16 లక్షల కోట్ల రుణమాఫీ, ఆదానికి చెందిన సంస్థలకు ఎయిర్ పోర్ట్, పోర్ట్,గనులు, రహదారుల నిర్మాణం వంటి ప్రాజెక్టులు ఇవ్వడాన్ని తీవ్రంగా ప్రశ్నించడంతో బిజెపి దగ్గర సమాధానాలు లేక ఉక్కిరి బిక్కిరి అయిపోతుందని ఆయన విమర్శించారు.

రాహుల్ గాంధీ పై ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకుడు తర్విందర్ సింగ్ మార్వా మరియు కేంద్ర మంత్రి రవ్‌నీత్ బిట్టు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని రాహుల్ గాంధీకి బే షరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది ఎన్ ఎస్ యు ఐ కార్యకర్తలతో మీ ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.

ఈకార్యక్రమంలో ఎన్ ఎస్ యుఐ జిల్లా నాయకులు నిఖిల్ రెడ్డి, నరందీప్ , రాహుల్, బన్నీ, శిరోజ రెడ్డి. కాసిఫ్. అక్రమ్, మతిన్. ముబషీర్, సాహిబ్, కామిల్, సుఫిన్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments