నిజామాబాద్ నగరంలోని మేదర కులస్తులు వెదురు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దేవేందర్ మాట్లాడుతూ…బీసీ ఉప కులాల్లో మేదరి కులం అత్యంత వెనకబడినది.
వెదురు బొంగులు తీసుకొచ్చి తట్టలు, గంపలు, నిచ్చెనలు, రేషం తట్టలు, చంద్రింకలు తదితర వస్తువులు తయారు చేసి పట్టణాల్లో విక్రయిస్తూ జీవనం గడుపుతున్నాము. అయితే మార్కెట్‌లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగం విరివిగా పెరగడంతో ఉపాధికి చెక్ పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో అడవులు ఎక్కువగా ఉన్న కారణంగా ఎక్కడపడితే అక్కడ కంకబొంగు లభిస్తుండేది. దీని ద్వారా మేదరుల అల్లికలకు ముడి సరుకు విరివిగా లభించేది.
అడవులు అంతరిస్తుండడంతో అధికారులు కంకబొంగును అడవి నుంచి తీసుకురానివ్వడం లేదు.
దీంతో మేదరులకు చేతినిండా పనిదొరకక కుటుంబం దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నామని పేర్కొన్నారు.ప్రభుత్వం మేదరుల కోసం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
కానీ అది అందని ద్రాక్షగా మిగిలిపోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోషద్రి,గంగాధర్,సుదర్శన్, గట్టూ గంగాధర్,తదితరులు పాల్గొన్నారు.
