అసెంబ్లీ ఎన్నికల్లో దేవుళ్లపై ప్రమాణాలు చేస్తూ ప్రజాక్షేత్రంలో రైతులకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
శనివారం నగరంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రైతు పాలనపై ఎన్నికలా సమయంలో ఏం మాట్లాడారో గుర్తు చేసుకోవాలని ఎద్దేవ చేశారు.
అలాగే అన్ని రకాల వడ్ల గింజలకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడవకముందే ప్రభుత్వం పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని విమర్శించాడు.
అలాగే రాష్ట్రం ఆర్థిక వ్యవస్థలో క్షీణించిపోతుందని,రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.అలాగే ఎన్నికల సమయంలో మహిళలకు,వృద్దులకు రూ 2000 నుంచి రూ 4000 చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు.
అలాగే మూసీ పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ వేశారని విమర్శించారు. మూసి బాధితులకు లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.హైడ్రా పేరుతో బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు.
విద్యార్థులు.. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతకు ఇది నిదర్శనం…విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకతకు ఇది నిదర్శనమన్నారు. రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమైన జీవో 29ను రద్దు చేయాలన్నారు.
ఈ జీవో 29 తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ ప్రకారం కాకుండా 1:50 నిష్పత్తిలో ప్రిలిమ్స్ క్లియర్ చేసిన అభ్యర్థులను మెయిన్స్ కు అర్హత కల్పించిందని ఆయన వ్యాఖ్యానించారు.
అభ్యర్థులతో ప్రభుత్వం చర్చలు జరపాలను వారి ఆవేదన వినాలన్నారు. వారి డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిగణించాలని, లేకుంటే గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం జరిగేలా, వారి పక్షాన బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు.
నిరుద్యోగులకు మద్దతుపై బిజెపి నాయకుల అక్రమ అరెస్టులను ఖండించారు.
