ఓ మైనర్ కొడుకు ఖరీదైన కారు నడపాలని తండ్రే పురమాయించిన వ్యవహారంలో పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు కారు స్వాధీనం చేసుకొని తండ్రి మీద కేసు నమోదు చేసారు ఓ ఆర్ ఆర్ లో శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్లే మార్గంలో,ఓ తండ్రి 11 ఏళ్ల మైనర్ కుమారుడికి కారు స్టీరింగ్ అప్పగించాడు.
ప్రమాదకరమైన ఆ హైవేపై బాలుడు కారు నడుపుతుంటే ఆ తండ్రి పక్కనే కూర్చుని ఎంజాయ్ చేసాడు. కాగా అదే సమయంలో ఒక వ్యక్తి, ఈ ప్రమాదకర దృశ్యాన్ని తన మొబైల్‌లో వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశాడు.
విషయం రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు దాక వెళ్ళింది వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. కారు నంబర్ ఆధారంగా యజమాని అబ్దుల్ హాదీని గుర్తించారు.
డ్రైవింగ్ సీటులో ఉన్నది అతని 11 ఏళ్ల కుమారుడేనని తేలడంతో, రాజేంద్రనగర్ పోలీసులు నిందితుడైన తండ్రిని అదుపులోకి తీసుకుని, ఆ ఖరీదైన కారును స్వాధీనం చేసుకున్నారు.@@
