Tuesday, April 28, 2026
HomeLaw and Orderమత సామరస్యంతో పండుగ జరుపుకోవాలిబందోబస్తును స్వయంగా పర్యవేక్షించిన సీపీ సాయి చైతన్య..

మత సామరస్యంతో పండుగ జరుపుకోవాలిబందోబస్తును స్వయంగా పర్యవేక్షించిన సీపీ సాయి చైతన్య..

మార్కెట్లు, ఈద్గాల వద్ద షీ-టీమ్స్ నిఘా.. ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో పండుగ జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకాంక్షించారు. ప్రజలు శాంతియుతంగా, సోదరభావంతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ముస్లిం సోదరులు ఈద్గాల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం ఉదయం నిజామాబాద్ నగరంలోని శాంతినగర్ ఈద్గా, మదీనా ఈద్గాతో పాటు బోధన్‌లోని నర్సి రోడ్డు ఈద్గాలను సందర్శించారు.

ప్రార్థనలకు వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా తీసుకున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈద్గాల వద్ద ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్ పరిధిలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు:

ఈద్గాల వద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను కేటాయించి, రాకపోకలను క్రమబద్ధీకరించారు. అలాగే మార్కెట్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం షీ-టీమ్స్ ద్వారా నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కంట్రోల్ రూమ్ ద్వారా ప్రధాన కూడళ్లు, ఈద్గాల వద్ద ఉన్న సీసీ కెమెరాలను నిరంతరం పర్యవేక్షిస్తూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ పర్యవేక్షణలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, బోధన్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్మూర్ ఏసీపీ వెంకటరెడ్డితో పాటు వివిధ సర్కిళ్ల సీఐలు, ఎస్సైలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!