HomeDevotionalరంజాన్ వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ఇందూరు:

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ఇందూరు:

రంజాన్ పండుగను పురస్కరించుకొని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం నగరంలోని ఖిల్లా రోడ్ లో గల బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ఎండి రషీద్ ని కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మైనార్టీ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రధాని మోదీ అన్ని మతాల వారికి కేంద్ర పథకాలు అందే విధంగా చూస్తున్నారన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ సుఖ సంతోషాలు కలగాలని కోరారు. అనంతరం పలువురికి ఈద్ ముబారక్ తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, కార్పోరేటర్లు మఠం పవన్, చింతకాయల రాజేందర్, బంటు ప్రవీణ్, బళ్ళాల్ శశాంక్, ధాంపల్లి శివ, రాంపల్లి మురళి, బీజేపీ మైనార్టీ నాయకులు మునీరుద్దీన్, అసద్, మారవార్ కృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments