HomeTelanganaNizamabadమైనార్టీ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడిఉంది.రంజాన్ వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే

మైనార్టీ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడిఉంది.రంజాన్ వేడుకల్లో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే

మైనార్టీ సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ప్రధాని మోదీ అన్ని మతాల వారికి కేంద్ర పథకాలు అందే విధంగా చూస్తున్నారన్నారు. శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకొని ఆయన అర్బన్ నియోజకవర్గంలోనీ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు

. ఈ సందర్భంగా ఆయన నగరంలోని ఖిల్లా రోడ్ లో గల బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా మాజీ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు ఎండి రషీద్ ని కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ సుఖ సంతోషాలు కలగాలని కోరారు. అనంతరం పలువురికి ఈద్ ముబారక్ తెలిపారు.

కార్యక్రమంలో బీజేపీ కార్పోరేటర్లు మఠం పవన్, చింతకాయల రాజేందర్, బంటు ప్రవీణ్, బీజేపీ మైనార్టీ నాయకులు మునీరుద్దీన్, అసద్, మారవార్ కృష్ణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments