Thursday, April 30, 2026
HomeTelanganaNizamabadకత్తిమీద సాముగా మారిన అభ్యర్థుల ఖరారు .......అర్బన్ లో టికెట్ ల కోసం కీలక నేతల...

కత్తిమీద సాముగా మారిన అభ్యర్థుల ఖరారు …….అర్బన్ లో టికెట్ ల కోసం కీలక నేతల ఒత్తిళ్లు ……దిగ్గజ నేతలకు తిప్పలు

మున్సిపల్ ఎన్నికల పక్రియ లో కీలక మైన నామినేషన్ ల ఘట్టం పూర్తీ అయింది. ముఖ్యంగా అధికార పార్టీ లో అభ్యర్థుల ను ఖరారు చేయడం క్లిష్టంగా మారింది. పదేళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ఈసారి ఎన్నికల బరిలోకి దిగడానికి ఆశావహులు పోటెత్తారు. సుమారు 900 పై చిలుకు దరఖాస్తులు వచ్చాయి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సొంత సెగ్మెంట్ కావడంతో ఆ పార్టీకి కార్పొరేషన్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. అందుకే అభ్యర్థులు ఖరారు పక్రియ కీలకంగా మారింది.ఎన్నికల ఇంచార్జ్ గా మంత్రి ఉత్తమ్ రెడ్డి నియామకం అయ్యారు ఆయన ఇప్పటికే రంగంలోకి దిగి జిల్లా ముఖ్యనేతలతో సుదీర్ఘ కసరత్తులు చేసారు. ఎక్కువగా కార్పొరేషన్ మీద ఆయన ఫోకస్ పెట్టారు కానీ అర్బన్ లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సుదర్శన్ రెడ్డి లతో పాటు పీసీసీ మహేష్ వర్గాలు బలంగా ఉన్నాయి. వీరితో పాటు ద్వితీయ శ్రేణి నేతలు తమ అనుయాయులకు టికెట్ ఇప్పించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ముగ్గురు దిగ్గజ నేతల లను అదే పనిగా ఒత్తిడి చేస్తున్నారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన నేతలకు ఎలాగో నామినేటెడ్ పోస్టు లు ఇవ్వడానికి ససేమిరా అన్నారు కానీ ఇప్పుడు కూడా టికెట్ లు ఇవ్వడానికి నిరాకరించడం భావ్యం కాదని చెప్తున్నారు. అసెంబ్లీ లోకసభ ఎన్నికల్లో అత్యంత క్రియాశీలకంగా పనిచేసిన నేతలకు కార్పొరేషన్ ఎన్నికల బరిలోకి దిగే ఛాన్స్ ఇవ్వాలని ద్వితీయ శ్రేణి నేతలు పట్టు బడుతున్నారు. ఒక్కో డివిజన్ నుంచి ముగ్గురు నలుగురు నామినేషన్ లు వేశారు వీరిలో ప్రజా బలం ఉన్న నేతలకు అవకాశం ఇవ్వాలనేది పీసీసీ చీఫ్ మహేష్ ఆలోచనగా ఉంది. కానీ కొందరు సీనియార్టీ ని తెరమీదికి తెచ్చి అదే పనిగా అగ్ర నేతల మీద ఒత్తిడి చేస్తున్నారు. సర్వే ఆధారంగానే టికెట్ లు ఇస్తామని పార్టీ లో సీనియార్టీ ఎక్కువగా ఉన్న సరే కనీసం తమ సర్వే లో ఒకటి లేదా రెండో స్థానం లో వుంటేనే టికెట్ గ్యారెంటీ అని మహేష్ పదే పదే చెప్తున్నారు. మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి వంశీ హోటల్ అధినేత నరేందర్ రెడ్డి సతీమణి లు మేయర్ అభ్యర్థులుగా ప్రచారం జరుగుతుంది.కానీ డివిజన్ లో అభ్యర్థుల కోసం తమ అనుయాయులకు టికెట్ లు ఇప్పించుకోవడానికి గడుగు గంగాధర్ నగేష్ రెడ్డి, కేశ వేణు ,రత్నాకర్ లాంటి నేతలు తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!