Tuesday, January 20, 2026
HomeEditorial Specialఇది సంగతి కథనానికి స్పందన - ఎట్టకేలకు స్పందించిన మున్సిపల్ అధికారులు..

ఇది సంగతి కథనానికి స్పందన – ఎట్టకేలకు స్పందించిన మున్సిపల్ అధికారులు..

ఇది సంగతి కథనానికి ఎట్టకేలకు పారిశుధ్య సిబ్బందితో డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తాచెదారంను తొలగించడంలో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు.

రహదారులపై మురుగునీరు నిల్వ ఉండకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నిఖిల్ సాయి హోటల్ ముందు ఉన్న మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులకు అధికా రులు శనివారం శ్రీకారం చుట్టారు.

నిజామాబాద్ లోని పలు మురుగునీటి కాలువలా దుస్థితిపై ‘’ తనిఖీలు సరే… చర్యలెవీ…అన్న శీర్షికన గత వారం ‘ఇది సంగతి’లో కథనం ప్రచురితమైంది.

దీంతో స్థానిక మున్సిపల్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య పనులతోపాటు, నగరంలో ఉన్న మురుగునీటి కాలువలో పేరుకుపోయిన పూడికతీత పనులను కూడా ప్రారంభించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!