HomePOLITICAL NEWSArmoorఆర్మూర్ లో వెలుగులోకి వచ్చిన ఆర్థిక కుంభకోణం

ఆర్మూర్ లో వెలుగులోకి వచ్చిన ఆర్థిక కుంభకోణం

  • నిందితుని అదుపులోకి తీసుకొని వారం రోజులకు అరెస్ట్ చేసిన ఆర్మూర్ పోలీసులు
  • ఇప్పటివరకు ఈ కేసు విషయమై వివరాలు వెల్లడించిన పోలీసులు
  • పాత్రధారిని అరెస్టు చేసిన పోలీసులు సూత్రధారులెవరో తేల్చడం లేదు
  • ఆర్మూర్ లో సంచలనంగా మారిన ఈ కేసులో ఏం జరుగుతుంది?

.ఆర్థిక నేరగాళ్లు అక్రమార్జన కోసం ఏకంగా అధికారులనే తప్పుదోవ పట్టిస్తున్నారు. తప్పుడు నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి బ్యాంకుల్లో లక్షలాది రూపాయలు గృహ నిర్మాణాల పేరిట లోన్లు లేపుతున్నారు.

తాజాగా ఇటీవల ఆర్మూర్ లో ఓ ఘరానా మోసగాడు అరెస్టు కావడం సంచలనగా మారింది. అయితే చిన్న చిన్న నేరాలు జరిగితేనే మీడియాకు వెల్లడించే ఆర్మూర్ పోలీసులు ఇంత పెద్ద మొత్తంలో జరిగిన ఆర్థిక కుంభకోణం విషయమై నోరు మెదపకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈనెల 18వ తేదీన గృహ నిర్మాణాల కోసం ఆర్మూర్ లో కన్సల్టెన్సీని నిర్వహిస్తున్న వ్యక్తిని నకిలీ ధ్రువీకరణ పత్రాలు స్టాంపులతో ఘరానా మోసానికి పాల్పడ్డాడంటూ పోలీసు అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

అదుపులోకి తీసుకున్న వారం రోజుల తర్వాత అతని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. అదుపులోకి తీసుకున్న రోజు నుండి అరెస్టు చేసే వరకు…

మధ్య వ్యవధిలో పోలీసుల గోప్యత వెనకాల ఉన్న మతలబు ఏమిటో..? అర్థం కావడం లేదని పలువురు అంటున్నారు. పాత్రధారుని ఒక్కడినే అరెస్టు చేసిన పోలీసులు సూత్రధారులను ఎందుకు విడిచి పెట్టారనే విమర్శలు వెలుగుతున్నాయి.

ఈ క్రమంలో ఈ విషయమై జిల్లా పోలీస్ బాస్ కూడా ఆరా తీసినట్టు సమాచారం. అయినప్పటికిని కేసు పురోగతిని వివరించడంలో అధికారులు మౌనం వహించడం వెనకాల ఉన్న కినుక ఏంటో తెలియక స్థానికులు తికమకపడుతున్నారు.

అంతేకాకుండా శుక్రవారం ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ రెడ్డి కూడా సదరు మోసగాడి అరెస్టుపై స్పందించారు. నిక్కచ్చిగా విచారణ చేపట్టాలని కోరారు.

అవసరమైతే జిల్లా మంత్రి జూపల్లి తో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు కూడా సమాచారం అందించి కేసులో నిజాలను నిగ్గు తేల్చేందుకు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తామని వివరించారు.

ఇంత జరుగుతున్న ఆర్మూర్ పోలీసులు మాత్రం ఈ విషయమై నోరు మెదపక మౌనరాగాన్ని పాటిస్తున్నారు. ఇప్పటికైనా పాత్రధారితోపాటు సూత్రధారులను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

పోలీసులు నోరు విప్పకపోతే ఇక షరా మామూలే అన్న చందంగా పరిస్థితి తయారయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా పోలీసు కొత్వాల్ చొరవ చూపి కేసు వివరాలను వెల్లడించాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments