HomeCinemaస్కూల్లో అగ్ని ప్రమాదం.....పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు .....ఆసుపత్రిలో...

స్కూల్లో అగ్ని ప్రమాదం…..పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు గాయాలు …..ఆసుపత్రిలో చికిత్స …….హుటహుటిన సింగపూర్ కు పవన్ కల్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో.

అస్వ్యస్తత గురయ్యాడు హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అతను సింగపూర్ లో చదువుతున్నాడు.

మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ కు ఈ విషయం తెలిసింది.

హుటాహుటిన సింగపూర్ వెళ్లడానికి ఏర్పాట్లు చేసినా అరకు సమీపంలోని కురిడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు నిన్న మాట ఇచ్చానని…

కాబట్టి ఆ గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడి సమస్యలు తెలుసుకొంటాన’ని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి ఏర్పాట్లు చేసినందున వాటిని పూర్తి చేసి వెళ్తానని తెలిపారు.

మన్యంలో పర్యటన ముగించుకొని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments