HomeTelanganaNizamabadబీఆర్ఎస్ లో భారీగా చేరికలుకండువా కప్పిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల , జిల్లా అధ్యక్షులు...

బీఆర్ఎస్ లో భారీగా చేరికలుకండువా కప్పిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల , జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి ..

నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో బారీ చేరికలు జరిగాయి. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ 12, 30, 31 నుంచి భారీ మైనార్టీ యువత గులాబీ కండువా కప్పుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి గారు సాదరంగా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడారు.

మహ్మద్ ఇర్ఫాన్, అబ్దుల్ మాజీద్, జైను, నయీం, అలీం, షారూఖ్ నేతృత్వంలో భారీగా చేరికలు జరిగాయి. చాలా సంతోషం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో లేదు. అయినప్పటికీ చేరుతామని మైనార్టీ యువత పెద్ద ఎత్తున ముందుకు రావడం ఆనంద దాయకంగా ఉంది.

బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో లేదు. ఎవరైనా ఆశ పడితే, సంపాదించుకోవాలంటే అధికార పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్తారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమీ చేస్తలేదని ప్రజలంతా గ్రహించారు. పేదల ప్రభుత్వంగా బీఆర్ఎస్ కు గుర్తింపు ఉంది. మా పాలనలో కేసీఆర్ కిట్, షాదీ ముబారక్, ఆసరగా ఫించన్లు అనేక పథకాలను అమలు చేశాము.

ఇలా పేదల కోసం ఆలోచించిన వ్యక్తి కేసీఆర్. మా హయాంలో నిజామాబాద్ అర్బన్ లో గల్లీ గల్లీలో చమ్కా దియే. ఇప్పుడు నిజామాబాద్ హాలత్ మొత్తం ఖరాబ్ అయ్యింది.

ఇప్పుడున్న ఎమ్మెల్యే ఒక్క చెట్టు పెట్టలేదు. పెట్టిన చెట్టుకు నీళ్లు పోస్తలేడు. స్తంభాలకు విద్యుత్ వెలిగిస్తే అదే ఇప్పుడు పెద్ద ముచ్చట. నిజామాబాద్ మా హయాంలో మెరిసింది. కానిప్పుడు చీకట్లోలో గుడ్డిగా కనిపిస్తుంది.

ఆ మెరుపుల ఇప్పుడు లేవు. రాత్రి పూట సిటీని చూస్తే ఒక్క లైట్ వెలుగుతలేదు. అందుకే ఇదంతా చూసి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. వచ్చే కాలమంతా బీఆర్ఎస్ పార్టీదే. సీఎం అయ్యేది కేసీఆర్ మాత్రమే.

కొద్ది కాలం తర్వాత 10 ఏళ్లలో ఎవరికైనా వ్యతిరేకత వస్తుంది. పదేళ్లలో మాకు వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీకి 10నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది. సర్వే రిపోర్ట్ లో ఇప్పుడు ఎన్నికలు జరిగితే 10 ఎమ్మెల్యే సీట్లు కూడా రావని చెబుతున్నారు. మాకు మద్ధతు తెలపండి. మాకు అండగా నిలవండి.

మీకు మేమున్నామంటూ గులాబీ పార్టీ శ్రేణులకు, మైనార్టీ నాయకులకు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్,మాజీ NUDA ఛైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సుజిత్ సింగ్ ఠాకూర్, సత్య ప్రకాష్, జగత్ రెడ్డి,నవీద్ ఇక్బాల్ మతిన్,ఇమ్రాన్ శేహజాద్ సనావుల్లా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments