తొలితరం విప్లవోధ్యమ నేత కామ్రేడ్. కర్ణాటి యాదగిరి అన్న అని, ఆయన స్పూర్తితో బలమైన విప్లవోధ్యమాలను నిర్మించాలని
అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) రాష్ట్ర కార్యదర్శి B. దేవరాం
పిలుపును ఇచ్చారు.
నిజామాబాద్ పట్టణంలోని గౌడ్స్ కాలని ఖానాపూర్లో ప్రగతిశీల మహిళా సంఘం(POW)* ఆధ్వర్యంలో సంస్మరణ సభనునిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు: కామ్రేడ్. యాదగిరి అన్న జిల్లాలో విప్లవోధ్యమ నిర్మాణంకు పునాదులు వేసిన మూల స్థంభంలాంటి వాడు అన్నారు. అనేక మంది కార్యకర్తలను తీర్చిదిద్ది అందరికి ఆదర్శంగా నిలిచాడు అన్నారు.
మోర్తాడ్ సిరికొండ మండలాలతో పాటు భీంగల్ పాత తాలూకాలో పెత్తందారుల దోపిడీకి వ్యతిరేకంగా బలమైన విప్లవ పోరాటాలను నిర్మించిన కమ్యూనిస్ట్ యోధుడు అన్నారు. కులావివక్షతకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణంకు కృషి చేసాడని ఆయనను స్మరించుకోవడం అంటే విప్లవ పోరాటాలను నిర్మించాడమే అన్నారు.
నేటి యువతకు ఆదర్శంగా కామ్రేడ్. యాదగిరి అన్న ఆదర్శంగా నిలిచాడని ఆయన పోరాట వారసత్వాన్ని కొనసాంచాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంకు ప్రగతిశీల మహిళా సంఘం(POW) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కామ్రేడ్.వి.గోదావరి, అరుణోదయ సంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్. కె. గంగాధర్ లు ప్రశాంగించాగా ప్రగతిశీల మహిళా సంఘం(POW) జిల్లా నాయకురాలు కామ్రేడ్. జయప్రద అధ్యక్షత వహించగ
జిల్లా ఉపాధ్యక్షురాలు V. సత్తెమ్మ, సహాయ కార్యదర్శి B. నాగమణి, కాలనీ అధ్యక్షులు డాక్టర్. సత్యనారాయణ, గంగాధర్, నాగరాజు,POW నాయకురాళ్లు సునంద, నర్సక్క, స్వప్న, బాలలక్ష్మి, గీత, అనిత, తదితరులు పాల్గొన్నారు.
