సిద్దిపేట సమీపంలో కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఐదుగురు యువకుల గల్లంతు అయ్యారు మరో ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు సికింద్రాబాద్ లోని ముషీరాబాద్ కు చెందిన ఏడుగురు యువకులు శనివారం ఆటవిడుపు కోసం సరదా గా సిద్దిపేట్ లోని కొండపోచమ్మ రిజర్వాయర్ కు వచ్చారు.
అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ ఉండగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు యువకులు రిజర్వాయర్లో గల్లంతయ్యారు మరో ఇద్దరి యువకులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గల్లంతైన వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు
——–మృతుల వివరాలు 1. దనుష్ ( 20) ముషీరాబాద్..2. లోహిత్ 17 ( దనుష్ సోదరుడు) 3. చీకట్ల దినేశ్వర్ ( 17 ) బన్సీలాల్‌పేట్ సమీపంలోని కవాడిగూడ4. సాహిల్ ( 19 ) 5. జతిన్ ( 17) కైరతాబాద్ చింతల్బస్తీ—సురక్షితంగా ఉన్న ఇద్దరు—–1) కొమారి మృగాంక్ ( 17 ) ముషీరాబాద్ రాంనగర్ 2) ఇబ్రహీం ( 20 ) ముష్షరాబాద్
