Monday, April 20, 2026
HomeLaw and Orderఆస్తి పన్ను వసూళ్లు ఫోకస్ .....మొండి బకాయి లే టార్గెట్ ........రంగంలోకి కమిషనర్ .......రెవెన్యూ అధికారులకు...

ఆస్తి పన్ను వసూళ్లు ఫోకస్ …..మొండి బకాయి లే టార్గెట్ ……..రంగంలోకి కమిషనర్ …….రెవెన్యూ అధికారులకు దిశానిర్దేశం

మున్సిపల్ కార్పొరేషన్ ఖజానా నింపడానికి యంత్రాంగం కసరత్తులు చేస్తుంది. ఆస్థి పన్నుల వసూళ్ల మీద ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా మొండి బకాయి ల మీద ఎక్కువగా దృష్టిపెట్టనున్నారు. ఈ మేరకు కమిషనర్ సైతం నేరుగా రంగంలోకి దిగారు.

రోజువారీగా ఆస్థి పన్ను ఎలా వసూలు చెయ్యాలనేది రెవెన్యూ అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేసారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో 20 రోజుల గడువే వుండడంతో నిర్దేశిత లక్ష్యం మేరకు కార్పొరేషన్ కు ఆదాయం సమకూర్చే పనిలో ఉన్నారు.

దాదాపు 40 రోజుల పాటు మున్సిపల్ కార్పొరేషన్ లో అన్ని విభాగాల అధికారులు సిబ్బంది ఎన్నికల పనుల్లో బిజీగా ఉండిపోయారు దీనితో కార్పొరేషన్ లో కార్యనిర్వహణ వ్యవస్థ స్తంభించిపోయింది.

అందులోను ఆర్థిక అవసరాలు తీర్చే రెవెన్యూ టౌన్ ప్లానింగ్ విభాగాలు ల నుంచి ఆదాయం కుందించక పోయింది ఎన్నికల పక్రియ పూర్తయి పాలక వర్గం సైతం కొలువు దీరింది కార్పొరేటర్లు ఎన్నికల్లో తమ డివిజన్ లలో ఎన్నో హామీ లు ఇచ్చారు వారంతా ఇప్పుడు కార్పొరేషన్ అధికారుల మీద ఒత్తిడి పెంచ బోతున్నారు.

అందుకే ఖజానా ను నింపే కార్యం మీద అధికారులు ఫోకస్ పెట్టారు. నిజానికి జనవరి నుంచి మార్చ్ దాక మూడు నెలలు ఆస్తి పన్ను వసూళ్ల కోసం రెవెన్యూ అధికారులు స్పెషల్ డ్రైవ్ చెయ్యడం ఆనవాయితీ గా వస్తుంది కానీ ఎన్నికల విధులతో ఈసారి స్పెషల్ డ్రైవ్ సాద్య పడలేదు.

ఎన్నికల పక్రియ తో దారి తప్పిన ఆస్తి పన్ను వసూళ్ల ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం ఉదయం నాందేవ్ వాడలోని జోన్-1 కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి, పన్నుల వసూలుపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.

ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరువలో ఉన్నందున, నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని స్పష్టం చేశారు.క్షేత్రస్థాయి పర్యవేక్షణ: బిల్ కలెక్టర్లు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో పర్యటించి, బకాయిదారులతో మాట్లాడి పన్నులు వసూలు చేయాలి.

దీర్ఘకాలికంగా పన్ను చెల్లించని వారికి వెంటనే నోటీసులు జారీ చేయాలని సూచించార ప్రజలు పన్నులు చెల్లించేందుకు వీలుగా అవసరమైన చోట ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు .పన్ను వసూళ్లలో అలసత్వం వహించే సిబ్బందిపై చర్యలు తప్పవని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు.

ముఖ్యంగా భారీగా పేరుక పోయిన మొండి బకాయి ల విషయంలో కఠినంగా వుండాలని ఆయన స్పష్టం చేసారు ఇప్పటికే ఆయా డివిజన్ లావారీగా మొండి బకాయి దారుల జాబితా ను సైతం సిద్ధం చేసారు అవసరం అయితే అలాంటి వసూళ్ల కు తానే వస్తానని కమిషనర్ భరోసా ఇచ్చారని సమాచారం

ఇటీవలే ఎన్నికలో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఎనిమిది కోట్లఆస్థి పన్ను చెల్లించడం దుమారం రేపింది ఇలాంటి బకాయి ల విషయంలో కార్పొరేషన్ అధికారులు ఇంత కాలం ఎందుకు ఉదాసీనంగా ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే ఈసారి మొండి బకాయి ల మీద మరింత ఫోకస్ పెట్టాలని కమిషనర్ భావిస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!