పోలీసుల పేరుతొ ఓ వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేసిన ఉదంతం నగరంలోచోటు చేసుకుంది. నర్సాగౌడ్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం రోడ్డు పక్కన మద్యం తాగుతుండగా గుర్తు తెలియని నలుగురు యువకులు వచ్చి తాము స్పెషల్ పార్టీ పోలీసులమని బెదిరించారు.
తమకు డబ్బులు ఇవ్వకుంటే గంజాయి కేసు పెడుతామని భయపెట్టారు దీనితో సదురు బాధితుడు కుటుంబ సభ్యులను పిలిచి 50 వేల రూపాయలు ముట్టజెప్పారు. చివరికి వారు డమ్మీ పోలీసులు గా నిర్దారణ కావడంతో బాధితుల మూడో టౌన్ స్టేషన్ లో పిర్యాదు చేసారు.
