మెండోరా మండలం వెల్కటూర్ గ్రామంలో అంగన్వాడి స్కూల్ చేతబడి ముగ్గులు కలకలం రేపాయి. అంగన్వాడీ పాఠశాల గది ముందే గుర్తు తెలియని వ్యక్తులు చేతబడి చేసిన ఆనవాళ్లు ను చూసి గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ముగ్గులు వేసి అందులో పసుపు కుంకుమ నిమ్మకాయలు జీడి గింజలు వేసి ఉన్నాయి. రాత్రి ఈ ప్రాంతాల్లో క్షుద్ర పూజలు చేసి ఉంటారని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు
