Tuesday, April 21, 2026
HomeTelanganaNizamabadఆగిన అభివృద్ధి పనులను పరిశీలించిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల...

ఆగిన అభివృద్ధి పనులను పరిశీలించిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల…

ఈ రోజు నగరంలో పర్యటించిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు ఖలీల్ వాడిలో ప్రజల సౌకర్యర్థం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేట్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు.

ఈ ఎమ్మెల్యే, ఎంపీ లు శంబుని గుడి వద్ద ఉన్న దుకాణాలను ఎందుకు తరలించటం లేదు.గోడల మీద రాతలు కాదు నగర అభివృద్ధి ప్రణాళికలు చేయండి.

అభివృద్ధి కి కేరాఫ్ అడ్రెస్స్ BRS మాత్రమే*ఈ సందర్బంగా మా బి. ఆర్ యస్ హయం లో చేసిన అభివృద్ధి పనులు తప్ప ఒక్క ఇటుక కూడా ఈ రెండు సంవత్సరాల కాలంలో పెట్టలేదని విమర్శించారు.

రోజు రోజుకు నగరం విస్తరిస్తునందున ప్రజలకు స్వచమైన నిత్యావసరాలు అందుబాటులో ఉండే విధంగా చేపట్టిన మార్కెట్ పనులను మా బి. BRS హయాంలో సింహ భాగం పూర్తి చేసిన ఇప్పటి ఈ ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతాలను అసాంఘిక కార్యకలాపకలకు అడ్డలుగా మారాయని విమర్శించారు.

ఎమ్మెల్యే ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే నిధులు రాని పక్షంలో నా ట్రస్ట్ అభివృద్ధి ద్వారా నగర అభివృద్ధి చేస్తానని మాటలు మాట్లాడి అభివృద్ధి ని విస్మరిస్తున్నారు. కొత్త పనులు చేయకపోగా మా హయాంలో సింహ భాగం పూరతైన పనులకు చివరి దశలో ఉన్న పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటంలో ఈ ఎమ్మెల్యే విఫలమయ్యాడని అన్నారు.

అహ్మదిబజార్ లో ఈ రోజు ఉదయం మా BRS హయాంలో నిర్మాణం పూర్తి చేసిన మార్కెట్ ను పరిశీలించటం జరిగిందని ప్రస్తుతం ఆ మార్కెట్ పరిస్థితి ఆధ్వన్నంగా ఉందని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారి దుర్వాస తో కంపు కొడుతుందని ఇప్పటికి ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు,విమర్శించారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చిన గోడల మీద రాతలు రాయటం, శంబుని గుడి పక్కన ఉన్న దుకాణాలను తొలగించి వారికి ఈ మార్కెట్ లో షాప్స్ కేటాయించాలని ఆందోళనలు చేసి ప్రతి సారి అభివృద్ధికి అడ్డం పడ్డారని ఇప్పుడు మిరే ఆదికారంలో ఉన్న ఎందుకు దుకాణాలను తరలించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మార్కెట్ నిర్మాణ పనులు పూర్తిగా జరిగిన ఎందుకు కేటాయిస్తాలేరని అన్నారు. అభివృద్ధి పనులు చేసే ఆలోచన లేకపోయినా కనీసం ఉన్న పనులను ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారని విమర్శించారు.

మున్సిపల్ ఎన్నికల్లో BRS పార్టీ నాయకులు కార్పొరేటర్లు గా విజయం సాధిస్తేనే అభివృద్ధి సాధ్యమాన్ని మాటలు చెప్పటం కాదు చేతల్లో చూపించిన చరిత్ర మాదని అన్నారు.మున్సిపల్ ఎన్నికలు సమిపిస్తున్నందున కాంగ్రెస్, బీజేపీ నాయకులు పోటాపోటీగా అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తున్నారని కానీ ఆ నిధులను తీసుకువచ్చిన ఘనత BRS పార్టీకి దక్కుతుందని 100 కోట్ల నిధులు మా BRS ప్రభుత్వం హయాంలో మంజూరై ప్రతి డివిజన్ లో అభివృద్ధి పనులను ప్రారంభించామని గుర్తు చేస్తూ ఆ పనులకు సంబందించిన G.O కాపీలను మీడియా ముఖంగా ఇవ్వటం జరిగింది.

TUFIDC ద్వారా గతంలో 60 కోట్ల రూపాయలు G.O తీసుకువచ్చింది తామేనని బిగాల అన్నారు.ఆ G.O కు సంబంధించిన పనులను ఒక్క అడుగు ముందుకు పోక పోగా పాత G.O ను కొత్త తేదీల్లో మార్చి తామే తీసుకువచ్చినట్టు BJP మరియు కాంగ్రెస్ పార్టీలు మోసం చేస్తున్నాయి.

ఈ ప్రభుత్వం హయాంలో రెండు సంవత్సరాల కాలంలో కొత్తగా కేవలం 10 కోట్ల నిధులు మాత్రమే వచ్చాయాని అన్నారు.నిజామాబాద్ నగరంలో గతంలో విద్యుత్ కాంతులతో నిండిన నగరం నేడు అంధకారం ఎందుకు అయ్యింది.చేసిన అభివృద్ధిని పనులను కనీసం నిర్వహణ చేయలేని దౌర్బాగ్య పరిస్థితి లో ఈ ఎమ్మెల్యే ఉన్నారని ఏద్దేవా చేశారు.

ఈ ప్రభుత్వం హయాంలో శాంతి భద్రతలు క్షిణించాయని ఒక కానిస్టేబుల్ హత్య చేయబడ్డాడని, నిన్ననే ఒక మహిళ ఎక్సజ్ కానిస్టేబుల్ పై వాహనంతో తొక్కించారాని విమర్శించారు.మేము 2023 ఎన్నికల కంటే ముందు ప్రతి డివిజన్ కు 1కోటి రూపాయల నిధులతో శిలాఫలకాలు వేసి పనులు ప్రారంభించి చాలా డివిజన్ లలో CC రోడ్లు BT రోడ్లు డ్రైనేజీ వంటి పనులు చాలా మట్టుకు పూర్తి కావడం జరిగింది.

శిలాఫలకాలు మరియు G.O పత్రాలను మీడియా ముఖంగా చూయించటం జరిగింది.ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్, BRS నగర ఆధ్యక్షులు సిర్ప రాజు, మాజీ నూడా ఛైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్యప్రకాష్, సుజిత్ ఠాకూర్,జగత్ రెడ్డి, నవీద్ ఇక్బాల్, ఇమ్రాన్ షహజాద్, అబ్దుల్ మతీన్ ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!