HomeCRIMEరూ.10వేలకు డమ్మీ ఫోన్ విక్రయించి మోసం...

రూ.10వేలకు డమ్మీ ఫోన్ విక్రయించి మోసం…

నగరంలో రూ.10వేల కె డమ్మీ ఫోన్ విక్రయించి ఒకరిని మోసగించిన ఘటన నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

నగరంలోని మల్కాపూర్ తండాకు చెందిన మాలావత్ రమేశ్ కు,మహారాష్ట్రలోని అకోలాకు చెందిన రంజిత్ రాజాసింగ్ చౌహాన్ అనే వ్యక్తి తనకు అత్యవసరంగా ఆస్పత్రి ఖర్చులకు డబ్బులు అవసరమని చెప్పి,

అతని దగ్గర ఉన్న ఒప్పో ఫోన్ రూ.10వేలకే ఇస్తానని నమ్మించాడు.దీనితో మాలావత్ రమేశ్ రూ.10వేలు ఇచ్చి ఫోన్ కొనుగోలు చేశాడు. బాక్స్ తెరిచి చూడగా అందులో డమ్మీ ఫోన్ ఉన్నట్లు గుర్తించి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments