Thursday, April 23, 2026
HomeCRIMEఆటో అడ్డు తొలగించమన్నందుకు దాడి: ఒకరికి తీవ్ర గాయాలు

ఆటో అడ్డు తొలగించమన్నందుకు దాడి: ఒకరికి తీవ్ర గాయాలు

నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఓ పండ్ల వ్యాపారి తల పగిలి తీవ్రంగా గాయపడ్డాడు.

స్థానికుల కథనం ప్రకారం.. షాపింగ్ నిమిత్తం వచ్చిన కొందరు వ్యక్తులు తమ ఆటోను రోడ్డుపై నిలిపి ఉంచారనీ అన్నారు. అక్కడే పండ్లు విక్రయిస్తున్న వ్యాపారి, ఆటో వల్ల రాకపోకలకు ఇబ్బందిగా ఉందని, పక్కకు తీయాలని కోరాడు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి వివాదం ముదిరింది. ఆవేశానికి లోనైన ఆటోలోని వ్యక్తులు పండ్ల వ్యాపారిపై దాడికి తెగబడ్డారను అన్నారు.

ఈ దాడిలో వ్యాపారి తలకు తీవ్ర గాయాలయ్యాయను తెలిపారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!