నిజామాబాద్:
నిజామాబాద్‌లో ఆర్యవైశ్య సంఘం కమిటీ ఎన్నికలు మరో మలుపు తిరిగాయి. అభ్యర్థులు, వర్గాల మధ్య అభిప్రాయ భేదాలు తీవ్ర రూపం దాల్చటంతో కౌంటింగ్ ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ఎన్నికల కౌంటింగ్ పక్రియ మొదలైన కొన్ని గంటలకే అభ్యర్థులు, విభిన్న వర్గాలు పరస్పరం ఆరోపణలు, ఎదురుదాడులతో రణరంగాన్ని తలపించాయి.
సమస్యను పరిష్కరించేందుకు సంఘం పెద్దలు, ఎన్నికల కమిటీ సభ్యులు మధ్యవర్తిత్వానికి ప్రయత్నించినా చర్చలు విఫలమయ్యాయి. ఈ పరిణామాలతో కౌంటింగ్ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసి సమాచారం అందించారు. కొందరు అభ్యర్థులు ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని గట్టిగా ఆరోపణలు చేస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల తరహా ఉద్రిక్తతలు ఇక్కడ కూడా చోటుచేసుకోవచ్చన్న భయం వ్యాపిస్తోంది.
సమస్య పరిష్కారం ఎప్పుడు?
సంఘం పెద్దలు, ఎన్నికల అధికారులు తిరిగి చర్చలకు కూర్చోనుండగా, అభ్యర్థుల వైపు నుంచి సహకారం లేనిపక్షంలో కౌంటింగ్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై సభ్యులలో అసంతృప్తి సంఘం పరిపాలనపై విశ్వాసం సడలిపోకుండా చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
