HomeTelanganaHyderabadగాంధీ భవన్ వేదిక గా సాగిన కసరత్తులు రంగంలోకి ఇంచార్జ్ మంత్రి …..మున్సిపల్ ఎన్నికల ఫై...

గాంధీ భవన్ వేదిక గా సాగిన కసరత్తులు రంగంలోకి ఇంచార్జ్ మంత్రి …..మున్సిపల్ ఎన్నికల ఫై కాంగ్రెస్ ఫోకస్

మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ పకడ్బందీ కార్యాచరణ తో సమాయత్తం అవుతుంది. పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లా కావడంతో సానుకూల ఫలితాల కోసం స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. మున్సిపల్ ఎన్నికల బాధ్యతల ఇంచార్జ్ గా నియామకం అయినా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ రెడ్డి రంగంలోకి దిగారు.

ఈ మేరకు గాంధీభవన్ వేదిక గా బుధవారం రాత్రి పీసీసీ చీఫ్ అధ్యక్షత సమావేశం నిర్వహించారు. లోకసభ పరిధి లోని కీలక నేతలతో ఈ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు షబ్బీర్ అలీ మండవ వెంకటేశ్వర్ రావు సుదర్శన్ రెడ్డి లతో పాటు పీసీసీ ప్రధాన కార్యదర్శి లు డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ లు అరికెల నర్సా రెడ్డి డి రాజేశ్వర్ రావులతో పాటు ఆయా మున్సిపాలిటీ ల ఇంచార్జ్ లు సైతం ఈ భేటీ లో పాల్గొన్నారు. ఉత్తమ్ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేశారు.

పార్టీ పదేళ్లతరవాత అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కింది స్థాయి నేతల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటా పోటీ నెలకొంది. ఇప్పటికే ఆశావహుల నుంచి దరఖాస్తులను తీసుకున్నారు 60 డివిజన్ లున్న నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో టికెట్ లకోసం సుమారు 900 పైగా దరఖాస్తులు వచ్చాయి.

అంటే ఒక్కో డివిజన్ నుంచి యావరేజ్ గా 12 దరఖాస్తులు వచ్చాయని పార్టీవర్గాలు చెపుతున్నాయ్. టికెట్ ల కోసం పెద్దఎత్తున నేతల నుంచి ఒత్తిళ్ల వస్తున్నా నేపథ్యంలో గెలుపు అవకాశాలున్న వారికి టికెట్ లు ఇవ్వనున్నామని ఉత్తమ్ స్పష్టత ఇచ్చారు పక్కగా సర్వే నివేదికల మేరకే గెలుపు అవకాశాలున్న వారిని గుర్తించి టికెట్ లు ఇవ్వలనేది పీసీసీ వ్యూహంగా ఉంది లేదంటే నిజామాబాద్ నగరంలో అరడజన్ మంది నేతలు తమ అనుయాయులకు టికెట్ ఇప్పించుకోవడానికి సమాయత్తం అవుతున్నారు అందులోను కీలక నేతలే ఈసారి బరిలోకి దిగడానికి సిద్ధం అవుతున్నారు అందుకే టికెట్ లు కేటాయించే పక్రియ ఈసారి క్లిష్టంగా మారే అవకాశాలున్నాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments