HomeLaw and Orderశాంతియుతంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలి..నిజామాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్..

శాంతియుతంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలి..నిజామాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్..

రాబోయే గణేష్ ఉత్సవాలను నగరంలో శాంతియుతంగా నిర్వహించుకోవాలనీ నిజామాబాద్ టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్ వెల్లడించారు.మంగళవారం నిజామాబాద్ నగరంలోని బస్వా గార్డెన్ లో టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, నాలుగవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ ఆదాయంలో నాలుగవ టౌన్ పరిధి లోగణేష్ ఉత్సవాల సందర్భంగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని గణేష్ మండప నిర్వాహకులు సమన్వయంతో ఉండి భక్తి శ్రద్దలతో నిర్వహించుకోవాలని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలపాలు చేయ్యారాదని, చట్టబద్ధంగా ప్రభుత్వం నియమించిన నియమాలను ఖచ్చితంగా పాటించిస్తు విద్యుత్, ట్రాన్స్పోర్ట్ , సౌండ్ ఇతర విషయాలలో సామరస్యంతో ముందుకు సాగాలని తెలిపారు.

అలాగే గణేష్ ఉత్సవ నిర్వాహకుల ద్వారా వారి సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరిస్తామని ఎక్కడైతే గుంతలుగా ఉన్న రోడ్లను తాత్కాలికంగా పూర్తిచేసి సౌకర్యంగా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ప్రజలకు అసౌకర్యం కలిగించారదాని, అధిక డెసిబుల్ ఉన్న లౌడ్ స్పీకర్లు,డిజె సౌండ్ వలన గుండెజబ్బులు గల వారికి ఇబ్బంది కలిగించరాదని హెచ్చరించారు.

నిమర్జన సమయంలో అవాంచనియ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, మండపంలో రోజు రాత్రి ఇద్దరైన ఖచ్చితంగా ఉండాలని, సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు..

అనుమానస్పద వ్యక్తులుకాని దుర్ఘటన దృష్టికి వస్తే పోలీసులకు తెలియజేయ్యాలని పేర్కొన్నారు.అలాగే ప్రతి గణేష్ విగ్రహా ప్రతిమల ఏర్పాటుకు ఆన్ లైన్ ద్వారా సమాచారం అందించాలనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాల్గవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్,రెండవ ఎస్ఐ ఉదయ్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments