HomeCRIMEఆవులకు మత్తు ఇచ్చి ఎత్తుకెళుతున్న ముఠా గుట్టు రట్టు.... దెగ్లూర్ పోలీస్...

ఆవులకు మత్తు ఇచ్చి ఎత్తుకెళుతున్న ముఠా గుట్టు రట్టు…. దెగ్లూర్ పోలీస్ లకు అప్పగింత : పోలీస్ కమీషనర్ వెల్లడి

ని జామాబాద్ పోలీస్ కమిషనరెట్ ఆవులకు మత్తు మందు ఇంజక్షన్లు ఇచ్చి ఎత్తుకెళ్తున్న ముఠా గుట్టు ను సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు.

ఈ ముఠా ను దెగ్లూర్ పోలీసులకు తదుపరి విచారణ కోసం అప్పగించామని కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. మహారాష్ట్ర లోని నాందేడ్ నగరంకు కు చెందిన సయ్యద్ ఉమర్, అమీర్ కాలం, షాహెబ్, సమీర్ అలీ మహబూబ్ లు ఓ ముఠా గాఎర్పడి ఇన్నోవాతో పాటు ఇతర వాహనాలలో ఆవులను దొంగతనంగా తరలిస్తున్నారని జిల్లాలో వీరి కదలికలను గుర్తించకా సీసీఎస్ ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది.

ముఠాను పట్టుకోవడానికి నాందేడ్ కి వెళ్లి రెండు రోజులు అక్కడే మకాం వేసి ముఠా సభ్యులైన ఆరుగురి ని పట్టుకొని నిజామాబాద్ తరలించారు వారు వాడుతున్న ఇన్నోవా కార్ అట్టి కారుని వారు ప్రెస్ మరియు పోలీస్ బోర్డులు పెట్టుకొని దొంగ నెంబర్ ప్లేట్లు పెట్టి సీట్లు తీసేసిన కారుని సీజ్ చేసి తదుపరి చర్య నిమిత్తము దెగులూర్ పోలీస్ వారికి అప్పగించారు సీసీఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ తో పాటు సిబ్బంది యాదగిరి, సుభాష్, నీలేష్, నరేష్ లతో కలిసి ఈ ఆపరేషన్ చేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments