HomeCRIMEపాత కక్షలు.. ప్రాణం తీశాయి! జిల్లాలో లారీ డ్రైవర్ దారుణ హత్య..నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

పాత కక్షలు.. ప్రాణం తీశాయి! జిల్లాలో లారీ డ్రైవర్ దారుణ హత్య..నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

పాత కక్షలు ఓ లారీ డ్రైవర్‌ను కబళించాయి. మాటా మాటా పెరిగి, ప్రత్యర్థులు ఇనుప రాడ్లతో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మరణించిన విషాద ఘటన నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం పరిధిలోని యూపీ దాబా వద్ద చోటుచేసుకుంది. ఈ సంఘటనపై మృతుడి తమ్ముడు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, అలహాబాద్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ మహమ్మద్ సల్మాన్ (35), తన లారీ (నెం. KA-70-3854) లో గోధుమలు లోడ్ చేసి కర్ణాటకకు బయలుదేరాడు. ఈ క్రమంలో, అతను నిజామాబాద్ జిల్లా, ఇందల్వాయి మండలం, దేవి తండా ఎదురుగా ఉన్న యూపీ దాబా వద్ద ఆగాడు. మృతుడు సల్మాన్‌కు, అదే గ్రామానికి చెందిన మహమ్మద్ హమ్మద్ (25), అతని సోదరుడు మహమ్మద్ హసన్ లతో గత కొన్ని నెలలుగా వ్యక్తిగత వివాదాలు, గొడవలు జరుగుతున్నాయి. ఈ పాత గొడవలే హత్యకు దారితీశాయని తెలుస్తోంది.


ఫిర్యాదుదారుడు మహమ్మద్ హస్నయిన్ (మృతుడి తమ్ముడు, లారీ డ్రైవర్) డిసెంబర్ 16, 2025 సాయంత్రం 4:00 గంటల సమయంలో హస్నయిన్ తన అన్న సల్మాన్‌ను యూపీ దాబా వద్ద కలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి టీ తాగి, మాట్లాడుకున్న తర్వాత సల్మాన్ తన లారీ వద్దకు వెళ్లాడు.సుమారు 4:30 గంటల ప్రాంతంలో, నాగ్‌పూర్ నుండి హైదరాబాద్ వైపు వస్తున్న KA-07-C-2365 నంబర్ గల లారీ దాబా వద్ద ఆగింది.

ఆ లారీలో నుంచి మహమ్మద్ హమ్మద్, మహమ్మద్ హసన్, వారి తండ్రి మహమ్మద్ ఇజ్రిల్, మరియు ఖయాస్ తండ్రి బస్సన్ అనే నలుగురు వ్యక్తులు దిగారు. వీరంతా చేతుల్లో ఇనుప రాడ్లు పట్టుకుని ఉండటం పాత పగను మనసులో పెట్టుకుని, ఈ నలుగురు సల్మాన్‌తో గొడవకు దిగారు. మాటా మాటా పెరిగి ఇరుపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో, నలుగురు నిందితులు కలిసికట్టుగా సల్మాన్‌పై ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సల్మాన్‌కు తల, కాళ్లు శరీరంలోని ఇతర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి.

విపరీతంగా రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలి మరణించాడు. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన మృతుడి సోదరుడు హస్నయిన్‌పై కూడా దాడికి యత్నించగా, అతను ప్రాణ భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. హత్య చేయాలనే ఉద్దేశంతో, పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని, పథకం ప్రకారం నిందితులు తమ సోదరుడిని ఇనుప రాడ్లతో కొట్టి చంపారని హస్నయిన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీసులకు ఫిర్యాదు
ఈ దారుణ సంఘటనపై మృతుడి సోదరుడు మహమ్మద్ హస్నయిన్ డిసెంబర్ 16న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదు మేరకు, పోలీసులు నలుగురు నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారి నుంచి బుల్లెట్లు,ఇనుప రాడ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments