ఉమ్మడి జిల్లాలో చెరుకు రైతులకు ఆసరా గా ఉన్న గాయిత్రి షుగర్ ఫ్యాక్టీరీ యాజమాన్యం ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఖజానా కోట్ల రూపాయల్లో కుచ్చు టోపీ పెట్టిన ఉదంతం ఇది.
ఫ్యాక్టరీ కి చెరుకు తెచ్చే రైతుల పేరుతొ భారీఎత్తున ప్రైవేట్ బ్యాంకు ల్లో రుణాలు తీసుకున్న వైనం ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. అదికూడా ప్రభుత్వం రైతులకు వారు బ్యాంకు ల్లో తీసుకున్న పంట రుణాలను మాఫీ చేసింది.
ఈ నేపథ్యంలో గాయత్రి రుణ బాగోతం వెలుగులోకి వచ్చింది. యాజమాన్యం నిర్వాహకం తో ప్రభుత్వ ఖజానా కు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఎలాంటి రుణం తీసుకోని రైతుల కు సైతం వారి ఖాతాల కు నిధులు జమ చేసింది.
సదాశివ నగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామం లోఉన్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నాందేవ్ వాడ యుబీఐ బ్యాంకు నుంచి ఈ రుణాల బాగోతం జరిగింది.
చెరుకు సప్లైయి చేయడానికి వచ్చే రైతులపేర్ల తో వారి భూముల పట్టా పాస్ పుస్తకాలను బ్యాంకు లో తనఖా పెట్టి ఒక్కో రైతు పేరుతొ రెండు నుంచి మూడు లక్షల రుణాలు డ్రా చేసారు.చెరుకు ఇవ్వడానికి వచ్చే రైతుల నుంచి పాస్ పుస్తకాలు తీసుకోవడం ఆనవాయితీ గా వస్తుంది.
అందుకే రైతులు తమ పాస్ పుస్తకాల ను యాజమాన్యం కు అందజేసింది. వాటి కేవలం ఫ్యాక్టరీ పరిపాలన అవసరాల కోసంవినియోగించాలి కానీ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా బ్యాంకు అధికారులకు అప్పగించి ఆ రైతులకే తెలియకుండా వారి సంతకాలేవీ లేకుండా నే వారి పేర్ల మీద అదికూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ బ్రాంచ్ లో ఇదంతా ఓ పక్క ప్రణాళిక తో బయటి పొక్కకుండా గుట్టుగా కానిచ్చేశారు.
కానీ రేవంత్ సర్కార్ ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రుణమాఫీ కి పది రోజులక్రితం శ్రీకారం చుట్టారు. ఆయా రైతుల ఖాతాలకు నేరుగా ప్రభుత్వం నగదు జమ చేసి వారి పేర్ల మీద ఆయా బ్యాంకు ల్లో ఉన్న రుణాలను ఒకే దఫా మాఫీ చేసింది.
ఈ మేరకు రుణమాఫీ తీపికబురు ను సెల్ ఫోన్ ద్వార రైతులకు మెసేజ్ లు పంపారు. కానీ సదాశివ నగర్ మండలం లో నాలుగు గ్రామాల పరిధి లోని పలువురు చెరుకు రైతులకు ఫోన్ లకు సైతం ఇలాంటి మెసేజ్ వచ్చింది.
ప్రభుత్వం చెప్పిన తీపికబురు ను చూసి రైతులు ఖంగు తిన్నారు. అదేమిటి మేము ఎలాంటి రుణాలే తీసుకోలేదు మాఫీ ఎలా చేసారని నివ్వెర పోయారు. సమీప మండల వ్యవసాయ అధికారులను వాకబు చేసారు.
వారు రికార్డు లు చూసి ఔనూ మీరు పాలనా బ్యాంకు నుంచి చెరుకు పంట కోసం రుణాలు తీసుకున్నారు కదా అని చెప్పడంతో బిత్తర పోయారు. మేము అసలు బ్యాంకు కే వేళ్ళ లేదు సంతకాలే చెయ్యలేదు అలాంటిది రుణాలు ఎలా తీసుకుంటామని తెగేసి చెప్పారు.
బ్యాంకు అధికారులను వాకబు చేయడంతో ఔను గాయిత్రి షుగర్ ఫ్యాక్టరీ అధికారులే వచ్చి మీ కోసం లోన్ ప్రయత్నాలు చేసారని చెప్పారు.దీనితో రైతులు మంగళవార వెళ్లి ఫ్యాక్టరీ అధికారులను గట్టిగా నిలదీయడం తో వారు నీళ్లు మింగారు.
దాదాపు నలభై మంది రైతుల ఖాతాల వ్యవహారమే వెలుగులోకి వచ్చినప్పటికీ ఇంకా ఎంత మంది రైతుల పేర్ల తో రుణాలు మెక్కారనేది అధికారులే లెక్కలు తేల్చాలి
